పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

Nvn Chary కవిత

ఏడుపు డా .ఎన్.వి.ఎన్.చారి 19-06-2014 పక్కవాడి పై ఏడుపు సుఖాల శిఖరంనుండి పడదోస్తుంది మన ఏడుపు మనమేడుస్తే మనసు తేలికవుతుంది ఆరోగ్యం ఆశీర్వదిస్తుంది

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UQYMsZ

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ తొలి_తుది.. నీ తోనే @ నా గుండె గొంతు విప్పి పాడుకున్న తొలిపాట నీది. నా మనసు పరవశించి రాసుకున్న తొలి కవిత నీవు. నా కళ్ళు ఆత్రుత తో చూసిన తొలి రూపం నీది. నా హృదయం ఆశగా నింపుకున్న తొలి ఊహ నీది. నా పరిసరాలన్నీ ఉప్పొంగిన తొలి రాక నీదే. నా జీవితం తోడు కోసం చూసిన తొలి ఎదురు చూపు నీకై. నా శరీరం ప్రేమతో కోరుకున్న తొలి స్పర్శ నీది. చేజారి పోయే ఏకాంతానికి దొరికిన తొలి కౌగిలింత నీదే. సుదీర్గంగా సాగుతున్న నా శ్వాసలో తొలి నిట్టూర్పు నీతోనే. చిరకాలం సాగే ఈ పయనంలో నిరంతరం నా తోడుండేది నీవే నేను శ్వాసించినన్నాళ్ళు తుద వరకు ఉండేది నీతోనే. తొలి మొదలు నీ తోనే... తుది వరకు నీ తోనే. _కొత్త అనిల్ కుమార్ 19 / 6 / 2014 ( ప్రేమ కవిత_1999 )

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pnoqR8

Posted by Katta

Golla Siva Saradhi కవిత

ఇధి నా మొదటి ప్రయత్నం: భారమనుకుంటే ఆది భాద్యత కాదు కష్టం అనుకుంటే విజయం రాదు ఆశించేది ప్రేమ కానే కాదు ఆచరణ లేనిది ఆశయం కాదు చెమ్మగిల్ళనవి కళ్లే కాదు చెరిగి పోయినవి జ్ఞాపకాలు కానే కావు.

by Golla Siva Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKi6Nw

Posted by Katta

నవీన్ కుమార్ కవిత

!!ఆత్మీయ అక్షరం!! గువ్వంతగుండె ఎగరలేక ఎగాదిగా అయినపుడూ పిసరంత ప్రేమలేకా బతుకుపాట తడబడినపుడూ పెన్నూ పుస్తకమందుకుంటాను అలలెత్తే అశ్రువులు అక్షరాలుగా ఒదిగి నన్నల్లుకుంటాయి పెనువిషాదం పలకరించినపుడూ మరలిరాని నేస్తం మళ్లీ గురుతొచ్చినపుడూ పెన్నూ పుస్తకమందుకుంటాను కలం నుంచీ కరిగి కన్నీళ్ళు కళ్లల్లో కాంతిరేఖలై మెరుస్తాయి అంతరంగంతో అనేక యుద్ధాల్లో ఓడినపుడూ నమ్మకాలు నిలువ నీడలేక రాలినపుడూ పెన్నూపుస్తకమందుకుంటాను కాగితంపై చింది రుధిరాక్షరాలు రేపటికి మరోనన్ను ఆవిష్కరిస్తాయి నవీన్ కుమార్ !! 18/06/2014

by నవీన్ కుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ynILKc

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

కలం పట్టి కదం తొక్కి, ప్రజల నాడి చేతపట్టి, పెద్ద గద్దల ఎండ గట్టి, కదలాల్సిన జర్నలిజం కను చూపుల జాడలేదు, పార్టి కి ఒక పేపరు ఆ పేపరు ఒక సాంఘిక పేరు, కానీ ప్రతి పేపరు చేసేది భజన, ఒక వ్యక్తి నో, ఒక వర్గాన్నో, ఒక రాజకీయ పార్టి నో, ఒక ప్రాంతాన్నో తీసుకుని చేసే భజన ... చివరికి రాసిన వాడు, రాయించిన వాడు ఆనందంగా కలిసి భోజనం చేస్తారు, మరి పిచ్చి జనాలు మాత్రం రాళ్ళు రువ్వుకుంటారు.... సోదరులార లేవండి కళ్ళు తెరవండి, ఈ రోజు పత్రిక లో వాస్తవాలు కనబడవు అవి చూసి మనం ఆగ్రహించవద్దు, అవధులు దాటి అరాచకాలు చేయొద్దు......,

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nmrfys

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

ఎర్రని ఆ నీరు ఏమిటి ? ఓహో! నా దేశం లో ని ఒక అరాచకాల నది కాబోలు! చిరు నవ్వుల చెల్లెళ్ళు , న్యాయం అడిగిన సోదరులు, అమాయకపు తండ్రులు బాలి కాబడిన ఒక నది ! నల్లని ఆ ప్రాంతమేమి ? ఓహో ! కలవాళ్ళు కలిసే చోటు కాబోలు ! అందుకే నెమో అందులో జరిగే దుర్మార్గాలు ధర్మదేవత కి కనబడవు ! అదేమిటి ఆ వెర్రి కేకలు? ఓహో ! మా పేద బంధువుల ఆకలి కేకలు కాబోలు! ఉచితం గా వచ్చే సిమ్ కార్డ్ వారు తినలేరు, అది తప్ప ఇంకేది ఇక్కడ ఉచితం గా రాదు మరి !

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ynIGWZ

Posted by Katta

Srinivas Reddy Paaruvella కవిత

తడి లేని ప్రవాహం || పారువెల్ల ఒక్కొక్కసారి ... దేహం లోతుల్లోకి మనసు ప్రవహించదు తడిని గుండెలో దాచుకున్న మట్టి చెట్టులా నవ్వడమూ కనిపించదు తీరంలో ఇసుక మీద రాసిన రాతలు ఏ సంగతి చెప్పకుండానే చెరిగిపోతాయి అయినా ఏమీ అనిపించదు మామిడి కొమ్మల చిగురుటాకులు మసక మబ్బుల్ని చూసి దిగులుపడినా పూత పూసిన పువ్వంతా రాలిపడినా ఏ దృశ్యమూ కనిపించదు ఏ శబ్దమూ వినిపించదు లోపలినుండి వెలుపలికి పచ్చదనాన్ని పదే పదే తరమడమూ తెలియదు అలసి పడుకున్నాక బీడుపడ్డ మైదానంలా మేల్కోవడం అనుకోకుండానే జరిగిపోతుంది . ఇక లోపలినుండి వెలుపలికి వెలుపలినుండి లోపలికి ప్రవహించేందుకు తడి మిగలకపోవచ్చు http://ift.tt/1qvrfBg

by Srinivas Reddy Paaruvella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qvrfBg

Posted by Katta

Rvss Srinivas కవిత

|| బాల్యం || మళ్ళీ పుట్టాలనుంది (నా)బాల్యాన్ని అనుభవించేందుకు. బాల్యం నిడివి పెంచమని అడగాలి ఈసారి దేవుడు కనబడితే. మనసులో దాగిన బాల్యం పరుగులెడుతోంది కాయితప్పడవల కోసం... తొలకరి తరుముకొస్తుంటే. వడివడిగా పరుగులెత్తేసింది బాల్యం బరువులెత్తే పెద్దరికాన్ని తొందరగా అందుకోవాలని... ఇప్పుడు మనసు మాత్రమే పరుగెడుతోంది గతంలో బాల్యం చిందేసిన బాటలో దేవుడిని ఒక్కటే కోరాలని ఉంది నా బాల్యాన్ని నాకిచ్చేయమని. అంతే స్వఛ్ఛంగా... అంతే అల్లరితో మళ్ళీ పయనించాలని ఉంది పసితనం గడిపిన పల్లెల్లోకి. నా నేస్తాల నిష్కల్మషమైన మనసులలోనికి. ...@శ్రీ 19jun14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pm9Mtf

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధీ | Null statement | అర డజన్ కవిత్వాల్లో గుండెల్లో ఆరిపోయిన క్రాంతి ని వెలిగించే విశ్వప్రయత్నంలో ఓడిపోయి ఆర్మ్ చైర్ రాతల్లో జీవితపు సందేశాలు వెతుక్కుంటూ మనస్సు ని ఆవహిస్తున్న "నేను కాని "తనపు నిస్సహాయతలో కూరుకుపోతూనప్పుడు భీష్ముడి అస్త్ర సన్యాసం మర్మాలు విప్పి చెప్పుకుంటూ .. ఉలిక్కిపడుతూ ఊరడిల్లుతూ బ్రతికేద్దాంలే , వద్దన్నా శ్వాస నాళం ఉక్కిరిబిక్కిరి కి లివింగ్ డెడ్ లా నిలబడి భావరాహిత్యపు అభావం లో మరింత ముడుచుకుపోతూ అజ్ఞానపు సమాధుల్లో బ్లాక్ షీప్ బఫూన్ గిరి కి సిద్దపడి నంబ్ నెస్ మకుటం కి తలవాల్చేసి మరో అడ్జస్ట్ మెంట్ మౌసం లో కరిగిపోతూ బ్రతికేద్దాంలే . నిశీ !! 19/06/14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lIKIqo

Posted by Katta

Prasad PV కవిత

|| అమ్మా.. ఇక ఉంటాను || నీ యెద చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంది.. నీట్లో బురదమట్టి కింద బండరాయిల్లో ఇరుక్కున్న శరీరం నిన్ను చేరాలని చేసే ప్రయత్నంలో ఓడిపోతూనే ఉంది. ‘బియాస్’ జలాలు నీ కన్నీటితోనే ప్రవాహమై పొంగుతున్నపుడు నన్ను కనుక్కోలేక నిస్సహాయులై వెతుకుతున్నవాళ్ళు, ఒడ్డున నిల్చొని నా కోసం తపిస్తూ..విలపిస్తూ ఒకర్నొకరు ఓదార్చుకుంటున్న నువ్వూ ,నాన్నా నాక్కనపడుతూనే ఉన్నారు.. ఈ రాకాసి రాళ్ళను, బురద మట్టిని విదిలించుకొని మీ దగ్గరకు పరుగెత్తుకురావాలనుందమ్మా.. ఇప్పటికెన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు గడిచిపోయాయో.. నీళ్ళలో నాకు చలేస్తుందమ్మా! ఎప్పటిలాగే ఓ దుప్పటి కప్పవూ నా స్నేహితుల అమ్మానాన్నలు వెళ్ళిపోయారటగా ఇక మీరూ వెళ్ళిపోతారు మిమ్మల్ని కలవలేకపోయాను... క్షమించండి నన్ను మీదగ్గరకు చేర్చని ఆ దేవున్ని నిందిస్తూ ఈ బురద మట్టినే కప్పుకొని జలసమాదవుతాను...

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rbg3Y4

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||అనేకాలు|| దాటుకొచ్చిన దూరాలు ఎప్పుడూ సగాలే. తాబేలా, కుందేలా అనేది చరిత్రకొదిలెయ్. ఎంతగా విస్తరిస్తావో, అనేది ముఖ్యం కాదు ఎంతగా కురుస్తావు అనేది ఎదురుచూపుల ప్రశ్న. స్వాగతించు రాయలేకపోవడాన్ని, నీ వరకు నీవైనా,. దాన్నే హత్తుకోవడానికీ ప్రయత్నించు. ఇంతకాలం రాసి రాసి, దేన్ని ఉద్దరిస్తున్నావో ఏ భ్రమల్లో పడి అక్షరాల్లో దొర్లుతున్నావో. ఇక ఇప్పుడైనా,.. నీకింద పడి ముక్కలైన జీవితాల శాపనార్థాలు వింటుండు. బద్దలుకొట్టుకున్న హృదయాల్లో ఏమీ మిగలదు. కొట్టుకుపోతున్న దేహాల్లో ప్రాణమూ వుండదు. అదే వదిలిపోయాక, కవిత్వమూ విగతమే. Oh,. still are you available ? -------------------------------------19/6/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sqfVbA

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

యుగయుగాలుగా సజీవ సాక్షులు సూర్య చంద్రులే మనలో ధైర్యాన్ని ఇస్తూ శక్తి ని సూర్యుడు అందిస్తే మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని జాబిల్లి ఇస్తుంది జాబిల్లి అంటేనే ఎందుకో ప్రతి ఒక్కరికి మక్కువ చల్లని వెన్నెలలో పిల్ల గాలులలో మధుర భావాలకు నెలవు చిన్నారి రామయ్యకు కుడా చందమామే ఆటబొమ్మ ప్రతి చిన్నారికి చందమామ రావే జాబిల్లి రావే ఉరట జ్య్తోతిష శాస్త్రం లో కూడా చందమామ మనసు కారకుడు అలసిన మనసులు , కష్ట పడిన శరీరాలకు జాబిల్లి దివ్యౌషధం అందరిని అలరించే జాబిల్లికి తప్పలేదు కదా గ్రహణం ఇదే సృష్టి వైపరీత్యం ... విచిత్రం కదా .. మనమెంత !!పార్ధ !!19/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lYrKB1

Posted by Katta

Pratapreddy Kasula కవిత

రామాచంద్రమౌళిగారి కవిత కొత్తది చదవండి.. http://ift.tt/1njgI5Z

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1njgI5Z

Posted by Katta

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి || బాల్యం || - - - - - - - - - - - - - జారిపోతున్న లాగూకి మొలతాడు అడ్డం వేసి ఒరలో చీపురు పుల్ల పెట్టి రాజసంగా నడవటం గుర్తుందా కర్రపుల్లను చర్నాకోలా చేసి సైకిల్ టైరును రథంగా తోలటం గుర్తేనా బంతిని బాణం చేసి ఏడు పెంకుల్ని ఏకాగ్రతగా పడగొట్టి శత్రువులకు చిక్కకుండా చాకచక్యంగా మళ్ళీ వాటిని నిలబెట్టిన సాహసం గుర్తుందా పగిలిపోయిన రబ్బరు బంతీ అందులోంచి రాలిపడిన బాల్యంలాంటి ఇసక మట్టీ గుర్తేనా 19-6-2014

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UeplHR

Posted by Katta

Maddali Srinivas కవిత

శాశ్వతానందాన్వేషణ//శ్రీనివాస్//19/6/2014 --------------------------------------------------- భావ జలప్రవాహ గర్భ మీన మస్తిష్కం లో లాభ నష్టాల రాజు స్థిరుడై మేకపోతు నాలుక పై కపట వాగ్గంభీరాఖ్యుడు నాట్యం చేస్తుంటే విక్రమాల కొలువుకు రేడు యెద్దు నొదిలిపెట్టేసి తూకానికెక్కితే,మనసును కమ్మిన ధూమ కేతువాతని కబళిస్తే గృహ మేధి, యిల్లు విడిచి,గురువింట్లో శత్రు రాజు వశమై ,కర్మ బ్రష్టుడైతే రోగాన బడ్డ కర్మాగారపు యజమాని వక్ర గతుల్లో ఆదాయానికి గండి కొడితే అప్పులే ఆదాయాలు ఖర్చులే వైభోగాలు అధోపతనంలో అంతిమ స్తానం చేరుకోవటమే అసలు విజయంలా వెక్కిరిస్తుంటే, తప్పదింక తిరుగుబాటు యిల్లాలే యింటి దీపానికి చమురు కావాలి బిడ్డలు మాణిక్యాలై మెరవాలి తుప్పట్టిన సంసార రధచక్రాన్ని సరి చేసేందుకు అగ్ని రగలాలి ఆవేశం కావాలి గృహ మేధికి బంధనాలు తెగిపోవాలంటే అనుభవాల వుపాధ్యాయుణ్ణి శరణు వేడాలి ఆటంకాల కంటకాలు తొలిగించుకోని బలహీనపు కోణాలను సరి చేసుకోని ధాతువిచ్చే వాడితో నెయ్యం చేయాలి వక్ర మార్గాలకు మరమ్మత్తులు చేసి భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యలి వేయి రేకుల కమలాన్ని చుట్టుకున్న కోశాలన్నీ దాటేసెయ్యాలి మూలంలో చుట్టుకున్న సర్పాన్ని నిద్ర లేపాలి ఆ పైదాక దానితోకట్టుకోని నడవాలి గమ్యం చేరాక ,మార్గం తో పనేముంది సంతోషంగా సెలవు తీసుకోవాలి పునరాగమన గమనాల కు స్వస్తి చెప్పి ఆనందంలో తేలి పోవాలి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZYnL

Posted by Katta

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్ !! వాడంతే !! ---------------- నిన్నేకదా ప్రేమగా పిలిచాడు ఈరోజు నైజం నెత్తురులా కక్కనివ్వు మాటెప్పుడూ ఒకటే అనుకున్నావేమో నాణేనికి బొమ్మా,బోరుసులా రెండు నాలికలు వాడికి. చీకటి గడియ వేసుకుంటే రాతీదేవిలా ఓ కంటికి నువ్వు వెలుగు కళ్ళాపి చెళ్ళున ముఖంపై తాకినప్పుడు రాక్షసిలా మరో కంటికి. నిరాశ,నిస్పృహలు ఆవహించి నిస్సహాయుడిలా నిలబడినప్పుడు ధైర్యాన్నిచ్చే రుక్మిణివి మగతనం మీసంలా మొలిచినప్పుడు కాలికింద నల్లువి. కునుకు తీసే సమయాన కంటికి రెప్పలా..ఇంటికి దీపంలా.. కోపం రగిలిన క్షణాన తూట్లు తూట్లు వొళ్ళంతా రూపం మారేలా పాపానికి ప్రతీకలా. దేహం పులిసిపోయింది.. జీవితం అలిసిపోయింది.. ఊపిరి ఆగిపోయింది.. మరో బలిపశువు కోసం తా(ళి )డు పసుపు పులుముకుంటుంది కసిగా పీకలు కొయ్యటానికి ! 19-06-14

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZY7m

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || విశ్వ మోహన గీతం!! || భూ బంతి విష్ణు చక్రమై గిరగిరా తిరుగుతూనే ఉంది చండ ప్రచండ కాల దండ యాత్ర సాగుతూనే ఉంది. శిథిల చరిత్ర పుటలకింద బీటలు వారిన ఒక పురాగీతం కన్నీటి వూటై నన్ను ముంచెత్తూనే ఉంది ..!! చెల్లా చెదురైన నక్షత్రాలలో రవి చంద్రుల దాగుడు మూతలు.. రాతి పొరల్లో ని నీ పాత స్మృతుల్ని గొర్రెల కాపరి పాటలపిట్టల్ని చేసి లోకమంతా ఎగరేస్తూ ....!! యుగాలుగా ప్రవహిస్తూ అలసిన వృద్ధ నదుల చుట్టూ, ముద్ద బంతుల దండలతో అజ్ఞాత కవుల నిరీక్షణ !! రాకాసి బల్లుల రక్త గుహల్లో బిక్కు బిక్కు మంటున్న నిశాచర జీవాలు ..!! ఎడతెగని ఈ అన0త యానం ప్రాణాల పరిమళాల్ని మాత్రం తగ్గనివ్వదు..! కోట్ల జీవాల్లో కోటికాంతుల శక్తేదో ప్రాణ0గా మారి, ప్రకృతిని పాదాక్రాంతం చేసే విఫల యత్నం అజరామరం ....! ఆకలి ఆయుధమైన వేళ అసిధార అనివార్యమే ? మంచుపర్వాతాలంచున కుంకుమ పూల సి0ధూరాన్ని ధరిస్తన్న పృథ్వి ! శిలాయుగపు ఆది మానవం ఇగ్లూ .....ఎస్కిమో ... పిరమిడ్ ..మమ్మీలు అన్నీ బుద్ధుని చరణాల్లో లీనమవుతూ ..! అహం ..మోహం అంతు లేని ‘కామదహనం’ కాల ఝరీలో పీడకలలై ఉలిక్కి పడుతూ ..!! అంతులేని చరిత్రలన్నీ కడలి అడుక్కి క్రమంగా జారిపోతూ ..!! ఆదినుండి అంతం దాకా దుఃఖానికి చుక్కానవుతూ చరాచర జగత్తు ...!! హిమగిరుల్నుండి మంచుపూల మందహాసంతో మళయ మారుత మధుర యానం ..! వాన చినుకై జీమూతం ! నిప్పుకణికై అనలం ! అచల అనంత గగనం !! పాంచ భౌతిక గమనం పాంచ జన్యమై ప్రతి ప్రాణిలో ప్రణవమై ... ప్రకృతి –పురుషుడు జీవన్మరణాల కారక ప్రేరణై ఆచంద్రార్ఖ అమృత గానమై విశ్వమోహన రాగమై నాలో జన్మ జన్మల జ్ఞాపకాల్ని సృష్టిస్తూ ... ......................................... 19 – 06 -2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T96jSv

Posted by Katta

తిలక్ బొమ్మరాజు కవిత

తిలక్/రెప్పల కిటికీ __________________________ కిటికీ బయట ఒళ్ళు విరబూసుకుని పడుకున్న చీకటి రాత్రిని ఎక్కువగా తాగినట్టుంది ఒకటే మత్తు వాసన నక్షత్రాలు కూడా తమ శరీరంలో ఖాళీలను నింపలేనంతగా తయారయ్యింది కొండలు చెట్లు ఆకులు పువ్వులు అడవులు చిక్కగా మునిగిపోయాయి చేతులు కాళ్ళ నిండా నల్ల రక్తమే నా కళ్ళు ఎంతసేపు అద్దుకున్నాయో రెప్పల తలుపులు మూసేశాయి రాత్రి ఎప్పటికో ప్రొద్దున్నే నే లేచాక చూసిన తెల్లటి ఉమ్మెత్త పూల నురగ అక్కడంతా/ఇంతలా నిండిన చిక్కదనం మాయమయ్యాక ఇక ఎప్పటికీ నమ్మబుద్దికాలేదు నాకు నాకు తోడుగా ఉంటుందనుకున్న పదార్థమేదో కొత్త రంగేసుకుపోయాక మిగలాలనిపించలేదిక్కడ పచ్చికలన్నీ ఏడ్చి ఏడ్చి తమ శరీరంపై నీళ్ళ బిందువులయ్యాయి ఈ క్షణం/కణాలన్నీ కదలలేక మెదలలేక ఒంటరి యుద్ధంలో పావురాళ్ళై నేలకొరిగాయి ఇక ఎప్పుడూ ఎదురుచూడలేదు మళ్ళా కరిగిపోయే దానికోసం తిలక్ బొమ్మరాజు 19/06/14

by తిలక్ బొమ్మరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T96jBQ

Posted by Katta

Kancharla Srinivas కవిత

నిన్నటి వరకు అది అందాల నది నేడేమో విషాదాల జలధి.. దుఖం ఉప్పొంగే వరకూ అక్కడ నవ్వుల గలగల పూలను మింగిన తోటలో బతుకుల బతుకమ్మలాట

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qunrAq

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ || మిగిలుండాలి ! - అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి ,ఊరుండాలి కనీసం ఒక మనిషైనా మిగిలుండాలి మాటలన్నీ పగిలిపోయి ,కరిగిపోయి అర్ధాలన్నీ చెదిరిపోయి,బెదిరిపోయి భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెలవుండాలి కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు మళ్ళీ కొత్తగా మొలిచేందుకు ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి గతంలోకి ,భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి అర్ధరహితంగా ముఖాలమీంచి జారే చిరునవ్వులలోంచి వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి నీవేప్పుడైనా ప్రవేశించగలిగే నీదనే నిజమైన జీవితం ఒకటుండాలి కనీసం గూటిలోకి దూరేముందు టపటపా కొట్టుకునే పక్షి రెక్కల ఒడుపులా జీవితాన్ని ఒడుపుగా చేరుకోగలగాలి పారుతున్న నీళ్ళను చేతుల్తో కళ్ళిగొట్టి,తేర్చి దోసిళ్ళతో నీళ్ళను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదతీర్చాలి. చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపుముద్దలాంటి తేనెపట్టు మీద చివరిగా విలపిస్తున్నతేనెటీగలాంటి దేహంలోంచి అవశేషమే నిజమైన ప్రాణవంతజీవితమన్నట్లు ఎదగాలి నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలిఉండేందుకు ఎక్కడైనా ఒక చోటుండాలి ,ఊరుండాలి కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి * *జనవరి 2013

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1spFpG3

Posted by Katta