పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఆకాంక్ష..: మార్చి8 అంతర్జాతీయ మహిళా దినోస్తవం మళ్ళీ వచ్చింది.. ఆకాశములో ఆమే సగం అని ఆకర్షనీయమయిన నినాదాలు.. పబ్బుల్లో క్లబ్బుల్లో డిస్కౌంట్ల సరదాలు.. వయారాలు ఒలకబోయుటే టాలెంటని తీర్పులు.. సందేశం పంపుటయే కేరింగ్ అని వివరణలు.. సౌందర్యం సౌష్టవమంటూ చర్చోపచర్చలు.. దినోస్తవం మాటున తద్దినం జరుపుట కదా ఇది..! దినోస్తవం మాటున వ్యాపార వికృతి కదా ఇది..! దినోస్తవం మాటున దివాళాకోరుతనం కదా ఇది..! దినోస్తవం మాటున అంధానుకరణం కదా ఇది..! దినోస్తవం మాటున పురుషాధిక్యత కొనసాగింపు కదా ఇది..! దినోస్తవం మాటున స్త్రీని అంగడి సరుకు చేయుట కదా ఇది..! భౄణ హత్యలపై ఘోష లేదు..!! సాధికారికతపై సంభాషణ లేదు..!! సంపద సమానత్వంపై సంవేదన లేదు..!! వంటింట్లో నలుగుతున్న శ్రమకు న్యాయం చేసే ప్రతిన లేదు..!! ఇటువంటి అంతర్జాతీయ మహిళా దినోస్తవం వస్తే ఏంటి..అది రాకుంటే ఏంటి..?? నిజమయిన శుభాకాంక్షలు పలికే రోజోకటి రావాలని తలపోస్తూ.. వస్తుందని నమ్ముతూ.. సమస్త స్త్రీ శక్తికి నమస్సుమాంజలులు...!!! 07/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NGk090

Posted by Katta

Girija Nookala కవిత

స్త్రీ జన్మ జన్మ కే జన్మ నిచ్చు స్త్రీజన్మ ధన్యము గురువుకే తొలి గురువు నీకు అభినందనలు దాసివై మగవాడిని మహరాజు చేసినా మంత్రివై ఆ రాజు కు సూక్ష్మ ఙ్ఞానము నేర్పినా వెల కట్టలేని ఆలి వై ఆనందాలు పంచినా కడుపు లోని మానవ జాతిని మోసి జాతినే అమరం చేసినా ఊయల ఊపి జగతినేలే నాయకులని పెంచినా ఓర్పు,నేర్పు, సహన చాతుర్యాలతో అబలవైనా సబలవై లోకాలనేలినా నీకు నువ్వే మేటి,లేదు నీ జన్మకు సాటి మగవాడిలో సగమైనా ఆడదానిగా నీ స్రుష్టి అపూర్వము జన్మ జన్మల వారది మానవజాతి సారధి బరువైన బాధ్యలతో నీ జన్మ మానవాళికి నివాళి కష్టాలు,కన్నీళ్ళు,వేధింపులు,సాధింపులు కాకూడదు అవరోధము నీ జన్మ సార్ధకతకు నిన్ను నువ్వు తెలుసుకొ,నీ విలువ పెంచుకో తలబడి నిలబడి నీ జాతిని రక్షించుకో! మహిళా దినోత్సవం సంధర్భంగా నాకు తోచిన నాలుగు మాటలు

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NGfSGf

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

స్తబ్దత నది నదిలా లేదు పడవ పడవలా లేదు ప్రయాణం ప్రయాణంలా లేదు దరులను వొరుసుకుంటూ నీళ్లలా భ్రమింపచేస్తున్న పొడి యిసుక- దున్నల కాళ్లకడ్డం పడుతూ తెగిపడుతున్న తూనీగల రెక్కలు- ఆకాశం నడిమింట నెత్తుటెండను స్రవిస్తున్న సూరీడు- అంతా స్తబ్దతావరణం అవిశ్రాంత అలజడిమబ్బు నిశ్శబ్దం పాము చుట్టలు చుట్టుకుని బద్దకంగా కాలం రాయి కింద పడి వుంది అడుగు తీసి అడుగు వేస్తే ముళ్లు- ముళ్లు పరుచుకున్న నేల మీద యుద్ధాన్నెలా రచిస్తావు- అంతా ఎడారి నిశ్శబ్దం శ్మశాన నిశ్శబ్దం యుద్ధం తర్వాత యుద్ధక్షేత్రంలో చెల్లాచెదురుగా పడివున్న క్షతగాత్రుల అవయవ నిశ్శబ్దం ఓటమి నిశ్శబ్దం శిలాసదృశ్యమైన నేల మీద యుద్ధాన్నెలా రచిస్తావు- * కళ్లంలో కొంటికర్రతో సొప్పను పైకెత్తుతున్నాడొక రైతు పుల్లలను కూడేసి రాజేసిన మంటలో దుంపను కాలుస్తున్నాడొక పిల్లాడు పూలగంపను నెత్తిన పెట్టుకుని చెరువు కట్టెంబట ఊరిలోకి బయలుదేరుతుంది ఒకామె * నిశ్శబ్దం కొండ కూలుతుంది జనం నది కదులుతుంది ---------------------------------- Date: 07.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g60ZY8

Posted by Katta

Patwardhan Mv కవిత

కౌమార సంభవం :::: తనకు తానే అపరిచిత సందర్భాల్లోకి విసిరేయబడుతూ...... ****************************** నిన్నటి దాకా మీటిన సుశీల పాటలా సారవవంతమైన స్వర కేదారంలో పడ్డ గరగరల మొరం మొరాయింపులను బాల్యానికీ తనకూ సరికొత్త సన్నని కంచెలా మెల్లగా వరుసలో మొలుచుకొస్తున్న నూనూగు నలుపు మొలకలను మంచుఫలకంలా మిలమిల లాడే మొహం మీద తరచి చూసినా సరైన సమాధాలు దొరక్క ముటముటలాడుతున్న అసహనాల మేటలను. రహస్తంత్రులు రాత్రి చేసిన అస్పష్ట రాగాలాపన తన ప్రమేయం లేకుండానే రాల్చిన చిత్తడి స్వప్న భూపాలాలను నీలి బాటిళ్ళ బిరడా చీల్చుకొని పొగ లేని సెగ లాగా నిండిన మగతనపు మొనగాళ్ళ మాటల మోహ మాధుర్యాలను ఎవరిని ఎలా అడగాలి ఈ అసంకల్పిత ప్రతీకారచర్యలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను. నాన్న చెప్పడు కదా ! పాపం ! అమ్మాయి కాదాయె అమ్మ కొన్నైనా చెప్పడానికి ముడులను విచ్చుకుంటూ,ముళ్ళను కుచ్చుకుంటూ కుమారుడు. తొలకరి వాగులో తడబడి పడి ఈదుతూ కుమారుడు ! 07-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NFYOjz

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | యుగాల పర్యంతం విస్తరించే క్షణం లో... ----------------------------------------------------- జీవితపు సుసంపన్నతని దోచుకోగలిగేది కవులే- అనేకానేక కొమ్మలుగా విస్తరించినా వరదకి తోడుగా ఈదురుగాలి దండెత్తి వస్తే ఒక్కొక్క కొమ్మా కంపిస్తూ వేర్వేరు దిశల్లో ఒరిగితే మేను జలదరించేలా భూమిని చీల్చుతూ వేళ్ళు వెలికి వచ్చి, అల్లాడుతూ ఆచూకీ దొరకని మూలకి కనుమరుగై పోతుంది అనేకానేక తరాలుగా విస్తరించిన ఓ వృక్షం నీలోనూ విస్తరిస్తుంది మరొక శాఖగా వేదన తీరాన్ని తాకకుండానే విరిగిన అల, లేదూ, ఒడ్డు న తునిగిపడి ఉన్న ఎండ్రగబ్బ కావచ్చు కడలి లో ఊగిసలాడే నావ లా నిన్ను మార్చేందుకు తరతరాల వంశచరిత్ర ఆ గోడల్లో నిక్షిప్తమై- పునాది రాళ్ళలో పగుళ్ళుగా మారటం చూస్తావు- తట్టలలోకి మార్పిడి జరిగిన భవంతి తో అంతమై చదునుచేసిన నేల లో కొత్త కథ కి శంకుస్థాపన జరుగుతుంది నీలోకి పాదుకున్న విత్తు రక్తపుమడిలో నానుతూ ముళ్ళ తీగ గా, బలురక్కసి పొద గా మారుతుంది భారాన్ని దించుకోడానికి వెచ్చని ఒడి, లేదూ, వణికే నీ అరచేతిని బిగించి పట్టుకున్న హస్తమో కావచ్చు భూమిని తొలుచుకు పొయే తుట్టపురుగు గా నిన్ను మార్చేందుకు మూటగట్టిన అనుభవాలు నీటిబుడగలై నీలో తేలుతుంటాయి, గాలివాటు బతుకుల తాకిడికి పగిలి పదాలుగా జారుతూ. చిల్లుపడ్డ బొక్కెన లోకి కుళాయి నుంచే కారే నీటి బొట్లుగా నీలోంచి నిరంతరం నీలోకి తరగని తడి కంటి ధారలుగా... ఉషస్సులో ఉనికి లేని సంభవాలు నిశివేళ కి చోటుచేసుకుంటూ- క్రౌంచ మిథునం తల తెగిపడి కసాయి కడుపులో కావ్యమైనట్లు పురుగులు మెసిలే పుట్టలో పదాలుగా పురుడు పోసుకున్నట్లు- అహర్నిశలూ నీలో కాంతి పుంజాలు ప్రజ్వలిస్తూ నీ వాచక సరోవరాల్లో ప్రకృతి పద్మమై పరవశిస్తూ... జీవితపు సుసంపన్నతని నిజంగా దోచుకోగలిగేది కవులే, జీవితపు నగ్నత్వాన్ని దాచగలిగేదీ కవులే- అదెలాగ అన/లే/వు- ఎందుకంటే అదంతే! పెల్లుబుకిన డొల్లతనం తో ఎన్నో మెదళ్ళు వివస్త్రలై ఎదురౌతాయి అనాఛ్ఛాదిత భావనలు నీ మది ప్రాంగణం లో వివశ నృత్యం చేస్తాయి నగ్నత్వాన్ని కప్పుకున్న నగ్నత్వమై, అందులో అంతర్లీనమైన ఆత్మ వికసన ఛాయ లో దాగిపోతావు జీవితపు నగ్నత్వాన్ని నిజంగా దాచగలిగేది కవులే- కనుగొంటే నీవూ, నేనూ, ఎవరెవరో ఒక్కొక్క క్షణం లో ఉద్భవించే కవులం అనుకోని ఉత్పాతం లో అలమటించేవారం రెక్కమాను మీద రవ్వంత సేపు ఆగిన స్వేఛ్చా విహంగాలం! 07/03/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dzj8MT

Posted by Katta

Katika Manohar కవిత

poem written on 4-03-2014 వానమబ్బు నీలాకాశం నలుపురంగు పూసుకుంటోంది నామస్తిష్కం జ్ఞాపకాలరంగు పులుముకుంటోంది తెరలుతెరలుగా నల్లటిమబ్బు ఊరినికప్పేస్తోంది మబ్బు తెరల్లోంచి నా గతానుభవాలుతొంగిచూస్తూ కనిపించాయి బాల్యంలో బడి “ఎగరగొట్టినంత” వేగంగా పోరుగాలి పైకప్పులను ఎగరగొడుతోంది గట్టు మీద మేం తాటాకుబూరలు వూదిన శబ్దాల్లాగ ఆకాశంలో మేఘపుబూరలు ఎవరోవూదుతున్నారు కొమ్మపైని పిట్ట తనవీధిమిత్రుడ్ని పిలిచినట్టు, తల పైకెత్తి గట్టిగా ఎవరినోపిలుస్తోంది తిన్నెలపై ఇసుకగూళ్లకోసం మేం పోటీపడినట్టుగా, ఇక్కడి చెట్లకొమ్మలు పోట్లాడుకుంటున్నాయి చాలా రోజుల తర్వాత పాతమిత్రుడ్ని కలుస్తున్నట్టు అక్కడి జంతువులన్నీ కన్నార్పకుండా ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చున్నాయి ఒకవైపు ప్రళయం వస్తున్నట్టు జనమంతా పరుగులు పెడుతున్నారు కానీ అది ప్రణయం అనితెలిసిన అక్కడిచెట్లు, నేలమ్మను పూలతో అలంకరిస్తున్నాయి మట్టిపరిమళం గుప్పున ముక్కుకు తగులుతోంది ఇంతలో ఎవరో నేలమ్మపై "నీటిముత్యాల్ని" జల్లడం ఆరంభించారు ఆ ముత్యాల మెరుపులో నేలమ్మ మరింత సుందరంగా కనబడుతోంది పిలవకుండానే వచ్చిన అథిదులంతా ఈ ప్రణయవిందుని కళ్ళతో ఆరగించారు నాతో సహాఅక్కడున్న జీవులన్నీ ఈ ప్రణయజ్ఞాపకాల్ని ఇళ్ళకు తీసుకెళ్తూ కనిపించాయి. by... MANOHAR.K

by Katika Manohar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dzj7IY

Posted by Katta

Sriarunam Rao కవిత

హృదయం బరువెంతో తెలుసా? నీ అడుగులలో తడబాటును చూసి తడిసిన ఆ నయనాలను కురిపించే కన్నీటిని తూకం వెయ్యి.... టక్కున చెప్పేస్తాయి. అమ్మపెట్టిన సున్నిపిండికే రగిడిపోయిన చర్మం మత్తిళ్ళిన పతిమృగాలు పాశవికంగా చీల్చుతున్నా.. ఎందుకలా??? వెంటుండి బజ్జోపెడుతున్నారో... అడుగు తెలుస్తుంది... హృదయం బరువెంతో. తను కొనుక్కున్న కట్నపు కొలిమి, తననే దహిస్తుంటే.. ప్రేగుతెగిన పాపాయిలకోసం పాపం తనపై వేసుకుంటున్న అమ్మలనడుగు...తెలుస్తుంది.. హృదయం బరువెంతో. భంగపడ్డ మానమంటూ..శిక్షా తనకే వేస్తుంటే.. యాక్సిడెంటులవుతున్నాయని ఎడారులలో బ్రతకాలా? అని ప్రశ్నిస్తున్న లేతకళ్ళలోకి చూడు.... హృదయం బరువెంతో తెలుస్తుంది, రిజర్వేషన్లు నువ్విచ్చే భిక్షo కాదు, ఎందులో తక్కువని కోటాలిస్తావు? గుండెబలంలోనా? సునీతా విలియంసు ని అడుగు. కండబలం లోనా? లైలా ఆలీని అడుగు. త్యాగధనం లోనా? అమ్మ కంటే చిరునామా ఎక్కడుంది మనకు. ఎందులో తక్కువని పర్శంటేజులిస్తావు? పంతం పట్టిందంటే.. సృష్టికి పరమార్ధం తనే. ఎందుకైనా మంచిది.. మగాడినైనా చెప్పేస్తున్నా.. సమానత్వం యిస్తేనే సర్ధుకుపోతారు, లేకుంటే సర్దుకో.. నిన్ను త్రోసేసి పైపైకి ఎదిగిపోతారు. [మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో...] శ్రీఅరుణం

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lFcBF5

Posted by Katta

Rajaram Thumucharla కవిత

నడక లేనితనం (కవిత ) రచన :- రాజారామ్.టి తేది :-5-3-14 నడక మినహా... అంతా బాగున్నట్లేనని అనిపిస్తోంది నాకు- ఇదొక సుఖపు బాధలా నమిలేస్తోంది. దేహాన్ని మూటగా కట్టి అటక మీదేసినట్లు కుర్చి మీదకు గిరాటేస్తోంది నన్ను నడకలేనితనం- మూలనుంచిన బియ్యం బస్తాలోంచి ప్రతి రోజు కొన్ని వాడేస్తుంటే రోజులు గడిచే కొద్ది బస్తా బరువు తగ్గినట్లుగా నొప్పి తూకం తగ్గిపోతు గత ఙ్ఞాపకం భారం పెంచుతోంది- నడక తప్ప అంతా సజావుగానే సాగుతున్నట్లున్నది. యముని మహిషం తాకీతాకకుండా నన్ను చావు గొయ్యిలోకి నెట్టేసినప్పుడు పైన వున్న మెరుపులన్ని ఏకమై కాళ్ళ నుంచి కళ్ళలోకి ప్రవహించినపుడు వొక పేలవమైన పుల్ల పుటుక్కున విరిగిన నిశ్శబ్దపు ఉరుముల చప్పుడు. అంతా బాగానే వుంది నడక మినహా నిశ్చల నీటి కొలనులో కదలగనైన లేని సౌందర్య రహిత కలువలా జీవితం చప్పగా- కదలాడితేనే కదా!పద్య పాదానికైనా మనిషికైనా మనోహర సౌందర్యం దేనికైనా ఇప్పుడు ఎవరోఒకరిపైన నేను ఆధారపడి జీవించడం ఎంత బాగుందో అంతా బాగుండదనిపిస్తోంది- (కాలు విరిగిన అనుభూతి కీ స్పందించి)

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nn4wU4

Posted by Katta

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // ఆలోచనల రెక్కలు // ======================== నా ఆలోచనలు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి నేటి యువత జీవితాలు చూసి ఎక్కడ వాలాలో తెలియక అలసిపోతున్నాయి సత్యం సంత వీదిలో అమ్ముడుపోవడం చూసి నేటి సమాజ జీవచ్చవాలను లెక్కబెడుతూ వేదన పడుతున్నాయి జీవితమనే తెల్లటి కాగితంపై నెత్తుటి సిరా యొక్క మరకలు కనబడుతుంటే రసి కారుతున్న రాళ్ళ దెబ్బలని చూస్తూ శోక సంద్రంలో మునిగిపోతున్నాయి అహింస అపనమ్మకంతో పోటి పడలేక అణగిపోవడం చూసి నిరాశ, నిట్టూరుపు సెగలకి నీతి రెక్కలు కాలిపోతున్నాయి శాంతి పునాది లేని నేటి ప్రపంచం అశాంతికి నివాసమవుతుంటే నీతి బోద లేని నేటి సమాజం అవినీతికి పగ్గం కడుతుంటే అలసిపోయి, కాలిపోయి, అణగిపోయిన "ధర్మం" రెక్కలు నింగికి ఎగసేదెప్పుడో.... @ చిన్ని @ MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nmVeaw

Posted by Katta

Maheswari Goldy కవిత

ఉ ద య స మీ రా లు...!! మహేశ్వరి గోల్డీ. సజీవ ప్రియ దరహాసినిగా నీకై మౌనంగా నే రాస్తున్న రాగాక్షరాలు రాధికావనమున సప్తవర్ణకమలములయి నీలాకాశంలో హరివిల్లు వంతెనపై విరితేనె ధారలతో దివిపైన ముత్యాల ముగ్గులు వేస్తూ...!! సాహితీ సింధూర సౌధమున అందమయిన నక్షత్రాలు పొదిగిన మంచు తెరల పల్లకిలో ప్రమదాలయి మన ప్రేమ కధకు నగిషీలద్దిన ఉదయ సమీరాలను వెన్నెల కాంతిలో విరబూసిన సిరిమల్లెల సాక్షిగా...!! భాషెరుగని భావాలతో అభివర్ణిస్తూ మౌన సరస్సున పాల నురుగు తరగలపై నీ రాకకై వేయి దీపాలతో నిరీక్షిస్తున్నవి నిహారికలయి ప్రాణేశా...!! ప్రేమలతలతో నీ హృదయవీణపై కవితాలలుగా హొయలొలికించ నవ కవితావనిలో వంశధారలై వర్షిస్తున్నవి వసూధరా...!! ఊహల ఊర్వశిగా...!! కవితా కోమలిగా...!! నను నీ దరి చేర్చ తరలి వస్తున్నవి రాగ చంద్రికా సుమ మాలతీ సరోవరాన తరగని అక్షయ సుమలతలయి ఓ సునయనా...!! 07/03/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nmVdU2

Posted by Katta

కాశి రాజు కవిత

కాశి రాజు ||జమ్మి చెట్టు || ఒరేయ్ మర్సిపోకే అని బయటడ్డ కాళ్ళకి దుప్పడికప్పి గడ్డకట్టే సలిలో సుట్టెలిగించి నడుస్తూ పోతావ్. నీలుబిందెతో ఎత్తైన అరుగు ఎక్కలేక, అమ్మ పడిపోతుంది. వొలిగిన నీలు తుడిసేసి, మిగిలిన నీలు మొక్కలకేసి బిందిసొట్టతీస్తుంటే ఆ గోలకి తమ్ముడూ నేనూ లెగాల్సిందే ఇసురుగుంజ దాపెట్టి, పొత్తరంతో కొట్టి సొట్టతీస్తూ నీ సెయ్యి నలిగితే అమ్మా ఆ పూట నా నిద్దర బద్దలయ్యిందే అపుడు వండేసాక వేలొంచలేని నెప్పితో కూడార్చినపుడు నీ కాళ్ళమీద పడ్డ ఉడుగ్గెంజి వేడిగా లేదులేరా అంటే నమ్మేసానమ్మ పొగలుకక్కే అన్నాన్ని టిపిని కర్రలో పెట్టిస్తే అదిగో ఇప్పుడు ముసలిదయ్యిందే ఆ చేనుగట్టునున్న జమ్మిచెట్టు సరిగ్గా దానిమొదలే మొన్నమొన్ననే ఊదుకుతిన్నాం. ఆ అన్నగాటం మా ఆకలిదో, నీ ఆరాటానిదో ఒక్క ఆకైనా రాలి సెబితే బాగుండునని నాన్నా, నేనూ మాటాడుకున్నాం (వేడివేడన్నం తినేటప్పుడు మానాన కౌలుకి సేసే చేనుగట్టు , అక్కడుండే జమ్మిచెట్టు గుర్తుకొస్తాయి )

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiSZ9B

Posted by Katta

Vani Koratamaddi కవిత

ఆడపిల్ల నీవు లేక మనుగడే లేదు అంకురంగానే నిన్ను అణిచి వేస్తుంటారు నీవు వోచ్చెదారుల్ని మూసెస్తు వున్నారు గాయం చేసే వాళ్ళూ గాయాలు మానిచే వాళ్ళూ రక రకాల మనుషులు రంగులు మార్చే వాళ్ళు బందాన్ని చూడక బరితెగించేవాళ్ళుంటారు నీ సహనానికే శిక్ష వేసెస్తు వుంటారు అవకాశం.ఇచ్చావా అదను చూసి ఆవహించేస్తారు మెచ్చుకోలు నెపంతో గుచ్చుతూ వుంటారు వయసుతేడాలేదు వావి వరసా లేదు ఆడపిల్లైతే చాలు ఆశ పదుతుంటారు నీ అసలు రూపం మరచి ఆదమరచి వున్నారు హద్దుదాటే వారి అంతు చూడమ్మ నీలోని పులిని చంపెయ్యబాకు అవసరాన్ని బట్టి అవతారం మార్చుకో చదువుకోవాలి నువ్వు చరిత్ర తెలసుకోవాలి మనుష్యుల తత్వాలు చూసి మసలుకోవాలి వెళ్ళే దారుల్ని పరికించి వెళుతుండు దుష్టశక్తులకు నువ్వు దూరంగ వుంటుండు ఎదైతెనేం సుమా నిన్ను నీవు మలచుకో ఆడపిల్లను లే అని అణిగిమణిగి వుండకు మహిళా దినొత్సవం సందర్బంగా. వాణి కొరటమద్ది 7/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZaaKI

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే||నీ ఫోటో సజీవమే|| బెడ్రూం, కిచెన్, టాయిలెట్ అన్ని ఒకచోటే కంపు వేరైనా అన్ని ఒక కప్పు కిందే అనుకూలం అనుకుంటాం గాని ఎమ్ కోల్పోతున్నామో ఆలోచించే సమయమెక్కడ - ఎక్కడో? కాంక్రీటు జంగిల్లో స్వేచ్చ ఉన్న జంతువులం మెడకు గొలుసు లేదని సంభరం తప్ప మొండెం ఉరికొయ్యపై ఊగిసలాడుతుందని ఉలుకైన లేదు/రాదు జంతు చర్మమైన బాగుణ్ను ఉడకబెట్టి ఊరబెట్టి ఉపయోగించు.... కోటి రూకలతో శతకోటి ఆశలతో అంగుళం అంగుళం కొన్న పాలరాతి భవనం మూడు బాగాలే (బెడ్రూం,కిచెన్,టాయిలెట్) మూన్నాళ్ళ ముచ్చటే మూకుమ్మడిగా మట్టిపాలే మరమనుషులు/యాంత్రికజీవులు ఒక సంతాపం ఒక్క రోజు జ్ఞాపకం గాలిబుడగ జీవితం/గాలి బుడగై జీవితం వైరాగ్యంలే అని దులుపుకోకు మూడుగదులు(బెడ్రూం,కిచెన్,టాయిలెట్) గడప దాటి నీ మనసులో అడుగు పెట్టు జీవితపు మధురం జుర్రు ఆఖరి బొట్టు వరకు, తన పోలిక చొప్పున దేవుడు నిన్నెందుకు చేసాడో పశువుకి వివరించ్చొచ్చు ఆఖరి క్షణం వరకు.... గోడకు వ్రేలాడుతూ నీ ఫోటో సజీవమే ముందు తరానికి ఓ గొప్ప పాఠమే --ఆర్కే ||20140307|| పాతవాచకం

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P8bRLE

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEMLTq

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు ||తెలుగు వాడా|| తెలుగు వాడా! ఒరే తెలుగు వాడా! వజ్రాలు,రత్నాలు రాసులుగా పోసి అమ్మినవాడా.. రాయల నోట "లెస్స"గా కీర్తింపబడినవాడా.. ఆర్య సంస్కృతిని ఆకలింపు చెసుకున్న వాడా.. ద్రావిడ భాషలో ఒదిగిన వాడా.. ఒరే తెలుగు వాడా! జాతీయ పతాకానికి రూపునిచ్చినవాడా.. తెల్లవాడి తూటాకి గుండె దమ్ము చూపిన వాడా.. మన్నెం వీరుడి అమ్ములపొదిన అస్త్రమైన వాడా.. ఒరే తెలుగు వాడా! అవధానాన్ని ఆరంభించిన వాడా.. కాల జ్ఞానాన్ని పొందిన వాడా.. రామయ్యకు ఆవాసమిచ్చిన వాడా.. దక్షిణదేశపు ధాన్యాగారంగా కీర్తినొందినవాడా.. ఒరే తెలుగు వాడా! తెలుగు వాడా! ఒరే తెలుగు వాడా! తెలుగు గోడు పట్టని వాడా! అంగ్ల బాట పట్టిన వాడా! ఒరే తెలుగు వాడా! ఎల్లలు అనేవి లేకుండా ఎదిగావురా.. పరాయి భాషకు పట్టం కట్టి మాతృభాషని మట్టిమిద్దెలలోనే వదిలేశావురా! ఆంగ్ల భాషతో ఆస్తులు కూడబెట్టగలవేమో..! ఆప్తులని, ఆప్యాయతలను తెచ్చుకొలేవురా! శాఖలు విస్తరించాయి కదా అని వేర్లను మరువకురా మూలాలు లేకుండా నువ్వు మనగలగలేవురా.. తరతరాల నీ చరిత్రను తెలుసుకోరా ఎన్ని జన్మల పుణ్యఫలమో తెలుగును ఉచ్ఛరించే భాగ్యం నీకు దక్కిందిరా దాన్ని కాలదన్ని పాపం మూట కట్టుకోకురా తెలుగువాడా.. సకల భాషా జ్ఞానాన్ని సముపార్జించుకుందామురా.. కాని మన అమ్మభాషలోనే సంభాషించుకుందామురా.. తెలుగు తల్లి కన్నీటి వ్యధను తుడుద్దామురా.. ఒరే తెలుగువాడా! లేవరా.. నిద్ర లేవరా! భాష లేనిదే..జాతి లేదురా.. జాతి ఉనికికే నువ్వు ముప్పు తీసుకురాకురా తెలుగువాడా..! #07-03-2014

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEJ1Bu

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఊదారంగు పువ్వు|| తలవంచుకొని మంత్రాక్షరాలను ఏరుకొంటున్న నిన్ను ఓ శుభముహూర్తంలో ఊదారంగు పువ్వొకటి ఉచ్వాస నిశ్వాసల పరిమళాన్ని నిచ్చెనగావేసి పైకి రమ్మంటుంది ఖాళీ అయున పెదవుల్లో ఏదో మూల మిగిలిపోయున మధువు సలపరిస్తుంది కాళ్ళూ చేతులు కూడదీసుకొనే లోపే వీపుపై రెక్కలు మొలచి నింగిలోకి ఎగిరేస్తే నిన్నటి దాకా నీవే అల్లిన సాలెగూళ్ళలో చిక్కి సతమతమవుతుంటావ్ .............................. నిజమే మరిమళమంటే పిలుపే ....కానీ దాన్ని గెలుచుకోవాలి సుమా .........

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g5aIxK

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

దైవమిచ్చిన వరం *************** రావెలపురుషోత్తమరావు పల్లె నాకు దైవమిచ్చిన వరం పసితనపు పలవరింతల్లోనే పచ్చని పొలంలా సాక్షాత్కరించి పట్టు గొమ్మగా వెలిసింది. ఆరుగాలాలపాటూ అపురూపంగా ఎదిగి అన్నపూర్ణగా భాసించింది. వరికంకులన్నీ పాలపొట్టమీదకు రాగానే నిండు గర్భిణిలా తలవంచి నావైపు చూసి సిగ్గుగా తలవొంచుకుని నిలుచుంది కోతలన్నీ పూర్తికాగానే సంతానలక్ష్మిలా సౌభాగ్య సుందరంగా ఇలా ఇంటికిజేరి పుట్టింటి గౌరవాన్ని ఇనుమడింపజేసింది. మరోవంక మల్లెల మరువంపు దవనాల మేళవింపుగా సురభిళ పరిమళంలా పుట్టింటి ఆడబడుచులా మెట్టినింట అడుగునిడి మెట్టునెక్కి మురిసిముక్కలయి పున్నమి వెన్నెలై పుచ్చపూవులా విరిసింది కళ్ళాల్లో ఆరబోసిన పంటలన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుతూ కొట్టొచ్చిన కళతో గంతులేస్తూ చిందులేసింది. పల్లె నాకు కల్పవృక్షంతో సమానం. ఆ ఆనందపు జీవనదితో నేననవరతం మమైక్యం. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 07-03-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEnTvk

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ ||అమ్మ, కవిత్వం || ................................... అందరి అమ్మల్లాగే మా అమ్మకూడా నన్ను కన్నది పురిటినొప్పులు పడుతూ కాకపోతే నా కుడిచేతిమీద ముద్దుపెట్టుకొని లాలనగా నిమిరిందేమో బహుశా, అందుకే ఈ కవిత్వం పల్లెరుకాయలమీంచి జొన్నకొర్రులమీంచి నడిచినడిచి మోపులుమోసి నన్నుపెంచింది కాబట్టే, ఈ అక్షరాలకు ఇంత కన్నీటితడి మా అమ్మతో నా పేగుబంధాన్ని కొడవల్లిక్కితో బరబరా కోశారప్పుడు అందుకేనేమో, ఈ అక్షరాలకు ఇంత గరుకు గొడ్లుమేపుతూ బుజ్జావు తప్పించుకున్నపుడు ఎనకాల ఊరికి మర్లెసేది ధైర్యంగా అందుకేనేమో, ఈ అక్షరాన్ని మర్లేస్తూ నేను ! # *పాతవాచకం -'ప్రవహించే జ్ఞాపకం' నుండి..

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1la64zd

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~ ప్రసేన్ | ఆమె ............... ఆరిన దీపం వెనుక మిగిలే వెల్తురు చీకటి కొండెక్కిన ఆశాకాశ దీపం ఇసుకకొమ్మ మీద రెండు నీటిపండ్లు కదిలే జలపాతం వెనుక ఓ గుహ నేల కరిగిన దేవరహస్యం చెప్పిన అబద్దం వెలిగే లాంతరు ముందు నడిచే చీకటి. # [ప్రసేన్ సర్వస్వం' నుంచి ]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWTFMj

Posted by Katta

Kapila Ramkumar కవిత

|సూఫీ కవిత్వం || పరిచయం కపిల రాంకుమార్ ||సూఫీ కవిత్వం || పరిచయం అనువాదం దీవి సుబ్బారావు అరబ్బీ భాషలో '' సుఫ్ ' అంటే ముతకవున్ని అని అర్థంట!. సూఫీ అంటే దానితో నేసిన బట్ట కట్టుకునేవాడు. ఆడంబరాల్కు దూరంగా పవిత్రంగా జీవితాన్ని గడిపేవాడు. సూఫీ గూఢార్థం. అరబ్బీలో సూఫీ తత్వాన్ని ' తసవ్వుఫ్ ' అంటారు. సూఫీ కవిత్వాన్ని చదివితేనే సూఫీతత్వమూ తెలుస్తుంది. రూమీ ఆఫ్ఘనిస్తాన్‌ లో 1207 - 1273 మధ్య పారసీ భాషలో కవిత్వం చెప్పీ సూఫీ కవుల్లో అగ్రగణ్యుడు. ' మస్నవీ ' కావ్యం గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. రబియా ఆయన కంటే చాల ముందు కాలం 710-780. ఈమె ఇరాక్ లోని బస్రా నగరానికి చెందినది. అరబ్బీ భాషలో ఈ అమ్మ చెప్పిన కవితలు యెక్కూవగా లేవు గాని, చెప్పినంత వరకు గొప్పవిగానే కీ్ర్తింపబడినాయి. హఫీజ్ 14 వ శతాబ్దపు మెదట్లో ఇరాన్‌ దేశంలో పుట్టి అదే శతాబ్దం చివరిలో కాలంచేసాడు. పారసీ లో రచనలు చే్సాడు. రూమీ అంత పేరు పొందాడు. భగవంతుని కోసం పడే ఆరాటమే, తపనే ఆయన కవిత్వం దాన్నే ప్రతీకలుగ చెపుతాడు. ప్రేయసి భగవంతుడు. మధువు భగవంతుడి మీద వుండే ప్రేమ. మధువు సేవించి మత్తిల్లటం అంటే భగవత్భక్తిపారవశ్యమ్లో మైమర్చివుండటం. మధు పాత్ర హృదయానికి గుర్తు. మధువు అందించేవాడు భగవంతుడు కావచ్చు లెదా గురువు కావచ్చు. హఫీజ్ కవిత్వాన్ని ఇలా అన్వయించుకోవాలి. *** (1) మౌలనా జలాలుద్దిన్‌ రూమి -'' వీధిలోకి '' ఈ వీధిలోకి సుగంధాన్ని వెంట తీసుకురా ఈ నదిలోకి పట్టుపంచెలు విడిచేసిరా! ఇక్కడి మర్గాలన్నీ అక్కడికి దారితీస్తవిగాని ఇక్కడికీ యెక్కణ్ణించో రావు ఇవాళ మనం యే ఆచ్చాదన లేకుండా బ్రతకాల్సిన సమయమొచ్చింది! ** (2) రబియా : ''వేరు చేయకు '' దేవుడా! నిన్ను నేను నరకానికి భయపడి ప్రార్థిస్తుంటే నరకంలో పడేసి కాల్చు! స్వర్గం మీది ఆశతో ప్రార్థిస్తుంటే స్వర్గం నుంచి నన్ను దూరంగా నెట్టు! అలా కాకుండా, నిన్ను నేను నీకోసమే ప్రార్థిస్తుంటే నీ అనంతమైన సౌందర్యాన్నుండి నన్ను వేరు చేయకు! *** (3) హఫీజ్ - '' నిజంగా సిగ్గుచేటు '' వైద్యుడికి దగ్గరికి వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాను నా జబ్బేమిటో తెలుసుకుందామని నెలలు తరబడి పరీక్షలు చేసినా అసలు కారణం దొరకలేదు కాస్త అర్థం అయ్యేట్టు అతను చె్ప్పిందేమంటే నా చేతికున్న ఉంగరం రాయి నీలంగా వుందని తామంతా సవ్యంగా ఆలోచిస్తామనుకునే వాళ్ళలొ ఇంత అజ్`నానం వుండటం నిజంగా సిగ్గుచేటు. **** డీవి సుబ్బా రావు 143, వాసవి కాలనీ, హైదరాబాద్ 500 035 040-24035238 మొదటి ముద్రణ 2004 నవోదయ బుక్ హౌస్ , ఆర్య సమాజ్ ఎదురు వీధి కాచిగూడ, హైదరాబాద్ -27 వెల: రు.125/-

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDU1z3

Posted by Katta