పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Patwardhan Mv కవిత

కౌమార సంభవం :::: తనకు తానే అపరిచిత సందర్భాల్లోకి విసిరేయబడుతూ...... ****************************** నిన్నటి దాకా మీటిన సుశీల పాటలా సారవవంతమైన స్వర కేదారంలో పడ్డ గరగరల మొరం మొరాయింపులను బాల్యానికీ తనకూ సరికొత్త సన్నని కంచెలా మెల్లగా వరుసలో మొలుచుకొస్తున్న నూనూగు నలుపు మొలకలను మంచుఫలకంలా మిలమిల లాడే మొహం మీద తరచి చూసినా సరైన సమాధాలు దొరక్క ముటముటలాడుతున్న అసహనాల మేటలను. రహస్తంత్రులు రాత్రి చేసిన అస్పష్ట రాగాలాపన తన ప్రమేయం లేకుండానే రాల్చిన చిత్తడి స్వప్న భూపాలాలను నీలి బాటిళ్ళ బిరడా చీల్చుకొని పొగ లేని సెగ లాగా నిండిన మగతనపు మొనగాళ్ళ మాటల మోహ మాధుర్యాలను ఎవరిని ఎలా అడగాలి ఈ అసంకల్పిత ప్రతీకారచర్యలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను. నాన్న చెప్పడు కదా ! పాపం ! అమ్మాయి కాదాయె అమ్మ కొన్నైనా చెప్పడానికి ముడులను విచ్చుకుంటూ,ముళ్ళను కుచ్చుకుంటూ కుమారుడు. తొలకరి వాగులో తడబడి పడి ఈదుతూ కుమారుడు ! 07-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NFYOjz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి