పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Mohammad Abdul Rawoof Chinni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mohammad Abdul Rawoof Chinni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మే 2014, శుక్రవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

@ చిన్ని @ // సాగిపోతున్నాను // ========================= పేదవాడి చితి మంటలు రేగుతుంటే కులగజ్జి చాపకింద నీరులా మెల్లగా సాగిపోతుంది తోటివాడు మద్య తరగతి జీవితాలతో మదన పడుతుంటే మత పిచ్చి తుమ్మ ముల్లులా బ్రతుకులో గ్రుచ్చ్చుకుంటుంది దట్టమైన పొగలాంటి వర్గ పిచ్చి పిచ్చిదానిలా పరుగులు తీస్తుంది అన్యాయపు దీవి లాంటి డబ్బు రొచ్చు అసహాయతను వెక్కిరిస్తుంది కనుల ముందు పేదవాడి జీవితం రాలిపోతుంటే కనులుండి చూడలేని గ్రుడ్డివాడిలా బ్రతుకు గమనం సాగిపోతుంది ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవాహంలా పరుగులు తీస్తుంటే అయ్యో బ్రతుకు పందెం ఓడిపోయనేమో అని భ్రమ కలుగుతుంది అయినా సరే.... సమాజ జీవచ్చవాలను లెక్కపెట్టుకుంటూ నా గుండెకు అయిన గాయానికి అతుకులు వేసుకుంటూ సల సల మనే నెత్తుటి శబ్దాన్ని నెమరు వేసుకుంటూ ముందుకి సాగిపోతున్నాను...... @ చిన్ని @ // 16-05-2014 MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlCQjy

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

@ చిన్ని @ // అమ్మ // ================== ఈ సృష్టిలో తీయనైన పాట పేరు అమ్మ ఈ జగతిలో మృదువైన మాట పేరు అమ్మ నాలోని ప్రాణం అమ్మ నా ప్రాణ దీపం అమ్మ నాలోని గుణమే అమ్మా..... నాలోని రూపం అమ్మ నా వెంట నీడే అమ్మ నా తోడు పేరే అమ్మా.... అమ్మ లేని చోటుని గమనించలేనుగా అమ్మ లేని జీవితం ఊహించలేనుగా.... ఆనందం గుప్పెట మూసి నా బ్రతుకుని మలిచింది అమ్మ తన ఆప్యాయత గుండెలో దాచి నా వెన్నెంటే నడిచింది అమ్మ మమతని ముద్దగా మలిచి గోరు ముద్దలు పెట్టింది అమ్మ తన మనసంతా నన్ను నింపుకుని నా తోడు నిలిచింది అమ్మ.. అందుకే... ఈ సృష్టిలో తీయనైన పాట పేరు అమ్మ ఈ జగతిలో మృదువైన మాట పేరు అమ్మ @ చిన్ని @// 11--5-2014 MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gp87Mx

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

" ఇది కవిత కాదు విలపిస్తున్న నా హృదయం " ------------------------------------------------- తెలవారని రేయిలో చీకటి బ్రతుకులు నక నక లాడుతున్న ఎండిన డొక్కలు కరడు గట్టిన గుండెల మద్య బ్రతుకుతున్న లేత మనసులు ఏడవలేక నవ్వుతున్న పసి హృదయాలు పరువుకోసం పాకులాడుతున్నపాపాత్ముల మద్య పగిలిపోతున్న పసి జీవితాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్న పందుల మద్య నలిగిపోతున్న మగువల జీవితాలు కనులు తెరిస్తే అబద్దం కనులు మూస్తే గారడీ అరచేతిలో విషపు రాతలు నడినెత్తిన అవినీతి దారులు పట్టపగలే దోచుకుంటున్న దోపిడీ దారులు నాదా ఈ సమాజం వినికిడి లేని విచిత్ర జీవితాల సమ్మేళనం నాదా ఈ సమాజం వేషదారుల విషపు చూపుల బీజం కుల పిచ్చి మత పిచ్చి వర్గ పిచ్చి అన్నీ కలిసి నా సమాజాన్ని దోచుకుంటున్నాయి అన్యాయంగా దూషిస్తున్నాయి అవినీతి నా సమాజాన్ని ఆకలితో చిదిమేస్తుంది. భగవంతుడా నా ఈ సమాజాన్ని కులం నుండి, మతం నుండి, వర్గం నుండి , అవినీతి నుండి, ఆకలి నుండి కాపాడు....................... @ చిన్ని MY Heart Beats 18/03/2014

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwi5g0

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // ఆలోచనల రెక్కలు // ======================== నా ఆలోచనలు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి నేటి యువత జీవితాలు చూసి ఎక్కడ వాలాలో తెలియక అలసిపోతున్నాయి సత్యం సంత వీదిలో అమ్ముడుపోవడం చూసి నేటి సమాజ జీవచ్చవాలను లెక్కబెడుతూ వేదన పడుతున్నాయి జీవితమనే తెల్లటి కాగితంపై నెత్తుటి సిరా యొక్క మరకలు కనబడుతుంటే రసి కారుతున్న రాళ్ళ దెబ్బలని చూస్తూ శోక సంద్రంలో మునిగిపోతున్నాయి అహింస అపనమ్మకంతో పోటి పడలేక అణగిపోవడం చూసి నిరాశ, నిట్టూరుపు సెగలకి నీతి రెక్కలు కాలిపోతున్నాయి శాంతి పునాది లేని నేటి ప్రపంచం అశాంతికి నివాసమవుతుంటే నీతి బోద లేని నేటి సమాజం అవినీతికి పగ్గం కడుతుంటే అలసిపోయి, కాలిపోయి, అణగిపోయిన "ధర్మం" రెక్కలు నింగికి ఎగసేదెప్పుడో.... @ చిన్ని @ MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nmVeaw

Posted by Katta

5, మార్చి 2014, బుధవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // నేటి ప్రపంచం // ================= రెండు చేతులు భగవంతుని వైపు చూపి తినడానికి తిండి లేక పనిచేసే ఓపికలేక ఎముకలలో సత్తువలేక ఎండిన డొక్కలతో వొంగిన నడుముతో బ్రతుకు జీవుడా అని ఒకవైపు తల్లడిల్లిపోతున్న ప్రాణాలు బ్రతుకుతుంటే మందు బాబుల మాయా ప్రపంచం మత్తులో ఊగుతుంది ధూమపానంతో దద్దరిల్లి పోతుంది పొగాకు పేరుతో ప్రక్కదారి పడుతుంది కుల, మత, వర్గ విభజనతో హోరెత్తిపోతుంది ఒకడి ఇంట్లో అన్నం తినడానికి గురుతుకురాణి కులం వాడికి న్యాయం చేయమంటే గురుతుకొస్తుంది. ఒకడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి అడ్డం రాణి మతం వాడికి సాయం చేయమంటే అడ్డుపడుతుంది తల్లి, చెల్లి లాంటి సాటి ఆడపిల్లని చులకనగా చూస్తుంది పసిబిడ్డలని పోత్తిల్లలోనే చంపుకునే విష సంస్కృతితో అల్లాడిపోతుంది ప్రేమ, ఆప్యాయత, మనసు, మమత మరిచి మాయ మాటలు నేర్చుకుంటూ విషపు భీజాలు నాటుతుంది ఇదేనా సమాజం...ఇదేనా ప్రపంచం భగవంతుడా...! చిమ్మ చీకటింట్లో చందమామ బ్రతికినట్లు కారు చీకటిలో మినుగురు మెరిసినట్లు ఎదురీది పోరాడే జీవితం (శక్తి) ని మాకివ్వు. @ చిన్ని @// 05-03-2014

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f7hPBh

Posted by Katta

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // చిన్ని పిచ్చుక // ================= చిన్ని పిచ్చుక చిన్ని పిచ్చుక నీ గూడునెవరు చేసారే చిన్ని పిచ్చుక చిన్ని పిచ్చుక నిన్ను గూటికెవరు చెర్చారే అలసి అలసి ఎగురుతావే ఆగి ఆగి చూస్తావే ఆకాశపు అంచులను తాకుతూ సొమ్మసిల్లి పోతావే తొంగి తొంగి చూస్తావే తుంటరి పనులు చేస్తావే చిన్ని వానలో కూడా చక్కగా చిందేస్తావే చిన్ని పిచ్చుక చిన్ని పిచ్చుక నా చెంత రావా నన్ను చేరుకోవా నా ముంగిలిలో ముగ్గేయ రావా నా తలపుల జడిలో చిందేయ రావా... @ చిన్ని @ // 23-02-2014

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fse6T5

Posted by Katta

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // చిన్ని పిచ్చుక // ================= చిన్ని పిచ్చుక చిన్ని పిచ్చుక నీ గూడునెవరు చేసారే చిన్ని పిచ్చుక చిన్ని పిచ్చుక నిన్ను గూటికెవరు చెర్చారే అలసి అలసి ఎగురుతావే ఆగి ఆగి చూస్తావే ఆకాశపు అంచులను తాకుతూ సొమ్మసిల్లి పోతావే తొంగి తొంగి చూస్తావే తుంటరి పనులు చేస్తావే చిన్ని వానలో కూడా చక్కగా చిందేస్తావే చిన్ని పిచ్చుక చిన్ని పిచ్చుక నా చెంత రావా నన్ను చేరుకోవా నా ముంగిలిలో ముగ్గేయ రావా నా తలపుల జడిలో చిందేయ రావా... @ చిన్ని @ // 23-02-2014

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fse6CF

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Mohammad Abdul Rawoof Chinni కవిత

@చిన్ని@|| అమ్మ || 04-02-2014 =========================== ఈ సృష్టిలోన తీయనైన మాట పేరు అమ్మ ఈ జగతిలోన మృదువైన మాట పేరు అమ్మ ఆకాశమంత ఎత్తు పేరు అమ్మ సముద్రమంత లోతు పేరు అమ్మ భూమి మీద చాలని బ్రహ్మ మారుపేరు అమ్మ నా కంటి వెలుగు పేరు అమ్మ నా గుండె స్పందన పేరు అమ్మ నా లోని రుధిరం అమ్మ నాలోని ధైర్యం అమ్మ నా తోడు నీడ పేరు అమ్మ ఏమని వర్ణించను అమ్మ ప్రేమని ఎంతని వివరించను అమ్మ మనసుసుని ఎలా చాటగలను అమ్మ త్యాగాన్ని ఏమని పాడను అమ్మ పాటని తన లాలిపాట లోని తీయదనం తన గోరు ముద్దలోని కమ్మదనం తన ఒడిలోని వెచ్చదనం అన్నీ కలిపితే అమృతం. @ చిన్ని MY Heart Beats

by Mohammad Abdul Rawoof Chinni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fV7ZVu

Posted by Katta