కూరాకుల వెంకట చలపతి బాబు ||తెలుగు వాడా|| తెలుగు వాడా! ఒరే తెలుగు వాడా! వజ్రాలు,రత్నాలు రాసులుగా పోసి అమ్మినవాడా.. రాయల నోట "లెస్స"గా కీర్తింపబడినవాడా.. ఆర్య సంస్కృతిని ఆకలింపు చెసుకున్న వాడా.. ద్రావిడ భాషలో ఒదిగిన వాడా.. ఒరే తెలుగు వాడా! జాతీయ పతాకానికి రూపునిచ్చినవాడా.. తెల్లవాడి తూటాకి గుండె దమ్ము చూపిన వాడా.. మన్నెం వీరుడి అమ్ములపొదిన అస్త్రమైన వాడా.. ఒరే తెలుగు వాడా! అవధానాన్ని ఆరంభించిన వాడా.. కాల జ్ఞానాన్ని పొందిన వాడా.. రామయ్యకు ఆవాసమిచ్చిన వాడా.. దక్షిణదేశపు ధాన్యాగారంగా కీర్తినొందినవాడా.. ఒరే తెలుగు వాడా! తెలుగు వాడా! ఒరే తెలుగు వాడా! తెలుగు గోడు పట్టని వాడా! అంగ్ల బాట పట్టిన వాడా! ఒరే తెలుగు వాడా! ఎల్లలు అనేవి లేకుండా ఎదిగావురా.. పరాయి భాషకు పట్టం కట్టి మాతృభాషని మట్టిమిద్దెలలోనే వదిలేశావురా! ఆంగ్ల భాషతో ఆస్తులు కూడబెట్టగలవేమో..! ఆప్తులని, ఆప్యాయతలను తెచ్చుకొలేవురా! శాఖలు విస్తరించాయి కదా అని వేర్లను మరువకురా మూలాలు లేకుండా నువ్వు మనగలగలేవురా.. తరతరాల నీ చరిత్రను తెలుసుకోరా ఎన్ని జన్మల పుణ్యఫలమో తెలుగును ఉచ్ఛరించే భాగ్యం నీకు దక్కిందిరా దాన్ని కాలదన్ని పాపం మూట కట్టుకోకురా తెలుగువాడా.. సకల భాషా జ్ఞానాన్ని సముపార్జించుకుందామురా.. కాని మన అమ్మభాషలోనే సంభాషించుకుందామురా.. తెలుగు తల్లి కన్నీటి వ్యధను తుడుద్దామురా.. ఒరే తెలుగువాడా! లేవరా.. నిద్ర లేవరా! భాష లేనిదే..జాతి లేదురా.. జాతి ఉనికికే నువ్వు ముప్పు తీసుకురాకురా తెలుగువాడా..! #07-03-2014
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEJ1Bu
Posted by Katta
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEJ1Bu
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి