పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జూన్ 2014, గురువారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయకుహరాన్ని ఛేధించుకొని మరీ ఎగసి ఉప్పోంగుతున్న జలధార. మునుపెన్నడూ గ్రోలి ఎరుగని ఈ నవీన సజీవధారను ప్రశ్నించాను ఓయి! జలధారా! చెలియలు కట్టిన ఏ రహస్య మార్గాల వెంబడి మీరు ఇలా నాదిశగా ప్రవహిస్తూన్నారు? గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతరంగ మధుకోశానికి కూర్చిన మరిన్ని నూతన శ్వేతవర్ణపు కుహరములందు ఆ స్వర్ణవర్ణపు మధూకరములు నా గత జీవితపు వైఫల్యాలనుంచి సైతం స్వారించి మరీ పూతేనియల్ని నింపుతున్నాయి! గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతరస్ధ నిశీధి లోనికి చొచ్చుకొని వచ్చెడు ఉష్ణమాలికా వీచికలు నా భావనలో వెచ్చటి కొలిమి సెగల వోలె తోచుటకు, అవి తమ తోడుగూడి గొనివచ్చెడి స్ఫూర్తి ప్రదములగు సూర్యకాంతి పుంజములేనని గ్రహించిన నా కనుదోయి చెమ్మగిల్లినది! గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతఃకరణలో ఆ పరమాత్మాంశనే నేను సాక్షాత్కరింప జేసుకున్నాను! Last Night As I Was Sleeping అనే అంటినియో మచాదో స్పానిష్ కవితకి తెలుగు అనువాదం. -- నరశింహశర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v1wjx0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి