కూరాకుల వెంకట చలపతి బాబు || విప్లవ గీతిక || రక్షించవలసిన నాయకులే మన సర్వస్వాన్ని భక్షిస్తుంటే.. నీతిగా పాలించవలసినవారు అవినీతికి తలుపులు తెరుస్తుంటే.. రాజకీయమనే ముసుగులోని రాబందుల హస్తాలలో మన హక్కులు ఆవిరి అవుతుంటే.. బోరున విలపిద్దామా? మనకి చేతకాదు అని చేతులు కట్టుకుందామా? పెల్లబికిన హింసానాధం మన కర్ణభేరులని చీల్చక ముందే.. పెరుగుతున్న ఆక్రమణల పర్వం పెనుముప్పుకు దారి తియ్యక ముందే.. భరత మాత రుధిరాశ్రువులు నిప్పుకణికలై మన జాతిని మట్టుపెట్టక ముందే.. కలసి కట్టుగా.. స్తుప్తావస్తలో ఉన్న మీ ధైర్యాన్ని వెన్నుతట్టి లేపండి.. మరో శ్రీశ్రీ జన్మించలేదు శీతల యంత్రాల ధాటికి చల్లారి చప్పబడిన మీ ఎర్ర రక్త కణాలను సలసల మరిగించి విధులు మరిచిన అధికారులని నిలదిసే శక్తినివ్వడానికి.. గండ్ర గొడ్డలి చేతబూని మరో పరశురాముడు రాడు విచక్షణ మరచిన పాలకుల రక్తంతో భరతమాతకు రుధిరాభిషేకం చేయడానికి.. మనమే కదలాలి.. మనమే కదపాలి.. ఈ చేతకాని ప్రభుత్వాలను.. చేవలేని రాజకీయాలను.. గళం విప్పి కదలండి.. కదం తొక్కి నడవండి.. భగత్ సింగులమై.. సుభాష్ చందులమై.. మరో స్వరాజ్య ఉధ్యమ జ్యోతికి సమిధలమై భావిభారత వెలుగుదివ్వెలమై.. మరో స్వేచ్చా ఉద్యమానికి ఊపిరి పోద్దాం.. అర్ధం మారిన స్వరాజ్యన్ని అర్ధవంతం చేద్దాం.. జై భారత్... జై హింద్.. // dt 12-04-2014
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmBEJS
Posted by Katta
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmBEJS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి