పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఏప్రిల్ 2014, శనివారం

Sriramoju Haragopal కవిత

నడక నడవకపోతే నడువదు బతుకు తప్పటడుగుల చిన్నతనం నుంచి ఇప్పటడుగుల పెద్దరికాల దాకా నడువక గడువదు కాలం ఎవరివో అరిచేతులు నా పాదాలకింద కొన్నిసార్లు తడి తడిగా, పొడి పొడిగా ఎందుకు నన్ను మొయ్యాలి, నా బతుకుబరువుని బండిలెక్క గుంజాలి? తెగి తీగెలకో, కొమ్మలకో చిక్కుకున్న పతంగులసొంటి జాడ తెలువని నా ఆలోచనలకు లండోరీలు వేసి గుంజుకునే బచ్పన్ కీ హర్కతే బహుత్ కాళ్ళ నుంచి నెత్తి దాకా చూపులతో నక్షాలు తీసి నోళ్ళ నుంచి నొసల్ల దాకా వూరంతా గుసగుసలే ఎటు వెళ్ళినా చూపుడు వేళ్ళ దిక్సూచీలు నా నడక నన్ను నడువనియ్యని లోకం

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUQcWd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి