జీవన పోరాటం _______పుష్యమి సాగర్ పురిటి గడ్డ మీద మొలకెత్తిన కొన్ని మొక్కలు ఉన్న ఊరు మొదలు కంటా నరికేసినపుడు దిక్కుతోచక నలు దిక్కులలో వేర్లను నాటుకుంటాయి !!!!! రెప రెప లాడిన రెండు ఆకులుగాలి తో ప్రయాణం చేసాయి ... దూర దేశానికి తరలి పోవటానికి , కాలాల్ని అమాంతం ఓడిసి పట్టుకొని చెదిరిన కల నుంచి కార్చిన్న కన్నీళ్ళ ని వంటి నిండా నింపుకొని మొలకెత్తిన విత్తనాలు ..>!!! కన్న పేగు బుడి బుడి అడుగలనుంచి జీవితమంత ఎత్తుకు ఎదిగే ప్రస్థానం లో ఎడారి లో చల్లటి చెలమ లాంటి ఒయాసిస్సులు ... చెరిగిన బొట్టు మరల అలంకారమవుతుంది మాయమైన నవ్వులు మళ్ళీ పువ్వులై వికసిస్తున్నాయి ఇప్పుడు నువ్వు నరకబడ్డ చెట్టు వి కావు , భూమి పొరల నుంచి ఉవ్వెత్తున చీల్చుకొని పుట్టిన కొత్త మొక్కవి , నిన్ను నువ్వు నలు దిశల పరుచుకొని ఆకాశానికి నీడనిచ్చే వృక్షానివి ...!!! ఎడారి విత్తనం , కష్టాలనే ఎరువులుగా చేసుకొని తియ్యదనపు కర్జూరం గా మారి మళ్ళా ఇంటికి తిరిగివస్తుంది ...!!! తల్లి....... నన్ను ముద్దాడి అక్కున చేర్చుకో ...!!! (బతుకు ఓడి లో కష్టాలను నష్టాలను చిర్నవ్వు తో ఎదుర్కొనేందుకు దూర దేశం కు తరలిన మిత్రుల మాటల తరువాత కలిగిన స్పందన...) ఏప్రిల్ 12, 2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPLV2G
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPLV2G
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి