పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Gundampati Vijaya Saradhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gundampati Vijaya Saradhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఏప్రిల్ 2014, గురువారం

Gundampati Vijaya Saradhi కవిత

విజయ సారధి / / కాలం // కాలాన్ని కత్తిరిద్దామని సూర్యున్ని కత్తెర అడిగితే సవ్వి ఇలా అన్నాడు. "కాలం కత్తెర కు అందని ఓ అపురూపమైన వస్త్రం. అది నీ జీవితం పై కప్పుకొన్న ప్పు డు చిల్లులు పడకుండా జాగ్రత్త పడు..లేదంటే వృద్ధాప్యం అనే చలి కాలం లోని వణుకు భరించలేవు" అని. 17-4-2014.

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j3C7PH

Posted by Katta

12, ఏప్రిల్ 2014, శనివారం

Gundampati Vijaya Saradhi కవిత

విజయ సారధి / / చిలుక // 1 ఎగిరేటి చిలుక వచ్చి మాటలెన్నో చెప్పింది ఓట్ల పళ్లు తిన్నాక ఎగిరి వెళ్లి పోతుంది 2 (ఉచితం) వరాలనీ ఉచిత'మనీ' సొంత డబ్బు ఇస్తారా? కన్ను గప్పి పన్ను వేసి వెన్ను విరవ కుంటారా? 12.04.2014

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qLmbof

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Gundampati Vijaya Saradhi కవిత

విజయ సారధి //మరమ్మత్తు // శిశిరానికి వసంతము చేస్తుంది మరమ్మత్తు గ్రీష్మ తాప విరహనికి వాన జల్లే మరమ్మత్తు చీకటి చలి రాత్రికి వెన్నెలమ్మ మరమ్మత్తు ఆకలి కేకల కడుపుకు అన్నమే మరమ్మత్తు శ్రమ దోపిడీ జరిగిసపుడు నివసించే గళమే కద మరమ్మత్తు.

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gavVXx

Posted by Katta

9, ఏప్రిల్ 2014, బుధవారం

Gundampati Vijaya Saradhi కవిత

/ / మినీ కవిత // సారధి పూలకు రంగులద్దాను అవి మిమ్మల్ని చ్చాయి అన్నాను నా పిల్లలతో పండ్లలో తీపి నింపాం అవి అమ్మానాన్నలనిచ్చాయి అన్నారు వారు నాతో

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PP56OZ

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

Gundampati Vijaya Saradhi కవిత

//హైకూలు//గుండంపాటి విజయసారధి గది గోడపై కాలాన్ని మోస్తూ క్యాలండర్ కాలాన్ని మేస్తూ గడియారం ప్రతి జననం కాలం ఆవిష్కరించే కొత్త పుస్తకం వేసవి ఎండ వేపచెట్టు నీడలో చిన్నబోయింది తన నీడలో తానే సేదతీరుతూ ఒంటరి చెట్టు ఎండ కానేపు చెట్టు నీడలో విశ్రమించింది

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oFs4r8

Posted by Katta