చెట్టు ......... @డా.కలువకుంట రామకృష్ణ చెట్టును వట్టి చెట్టనుకుంటేనే .. సరిపోదు , విత్తు చిన్నదే వికాసమే పెద్దది వేల కోట్ల ఆకుల సైన్యాన్ని కప్పుకున్న సైనిక శిబిరం భూమికీ ,ఆకాశానికీ వర్తమానాలు పంపే దూత మట్టికీ , మనిషికీ నిరంతరం నిర్మించే ఆకు పచ్చ వంతెన తన దేహ క్షేత్రం నిండా ఎన్ని మొగ్గలు పూలు గానో , పూలు.. పిందెలుగా,పిందెలు.. ఫలాలుగా .. పండించే నిత్య సేద్యకాడు .. సుదూర తీరాలనించి కొమ్మల చేతులతో పిలిచి నీడ ఒళ్ళో కూచోబెట్టి జోలపాడే తల్లి పేగు ఊహల్నీ ,ఊయలాటల్నీ ..హృదయాల్లో ముద్రించిన పెద్ద బతుకమ్మ పేర్లేవైతేనేం.. ప్రేమకు లోతు లేదేన్నడూ జీవితమంతా పరులకోసం ధారవొస్తూ కదలకుండానే ప్రయాణిస్తున్న బాటసారి తొవ్వ పొలిమేరలల్ల నిలవడి పహరా కాసే పల్లె రక్షణ కవచం ఒక్క వసంతం రాక కోసం ,ఎన్ని శిశిరాలైనా మౌనంగా భరిస్తూ ముండ్ల గాయాల్ని ఒంటి మీద కనపడకుండా బెరడు చుట్టుకుంటూ దుఃఖపు పండుటాకుల్ని , నిరాశా ఎండుటాకుల్ని .... నేల మీద రాలుస్తూ ... ఏటేటా ఒళ్ళు ఖాళీ చేస్తూ వసంత వస్త్రాల్ని ధరించేందుకు సిద్ధమై ఉంటది . . ఒక్క సారి గోరుతో గిచ్చి చూడు ,నీ గాయానికి బదులుగా రక్తాన్నీ, కన్నీళ్లను కలిపి పాలుగా బదులిస్తది. చెట్టును మరుగుజ్జును చేసి చేయవచ్చునేమో కానీ మమకారపు పరిమళాన్ని ఆపగలవా ? చెట్టు .. నదై నడుస్తది,గాలై .. వీస్తది కొర్రాయై మండుతdiది , వసంత గొంతుకవుతది పండుగలన్నిటికీ పెద్దర్వాజా తోరణమై తలెత్తి చూస్తది ఒంటిని కొమ్మలు రెమ్మలుగా చీల్చుకుని నిత్యం విస్తరించే .. పచ్చి బాలెంత చేతులు చాచి పిలిచి ఒళ్ళో కూచో బెట్టుకుని ఊరడిస్తూ చిగిరింతల పులకింతలతో మురిసి పువ్వై నవ్వినా ప్రతి శిశిరపు కడుపుకోత యాదిల్నే ఉంటది రెక్కలు రాని పక్షుల వేదనలూ ,రెక్కలొచ్చిన పక్షుల వలసలూ చూసి,చలించిపోయి ఛాతీని ఊపుతూ గుద్దుకుంటది చెట్టు .. నిరంతర నిర్ణీద్ర మౌన తాపసి .. కొత్త నెత్తుటిని పారించీకుంటూ ప్రాణవాయువై మనుషుల్ని నడిపించే ఆత్మగల్ల చుట్టం ఇవ్వడం తప్ప , తీసుకోవడం తెలియని పిచ్చితల్లి వేర్లమునివేళ్ళతో పాతాళం దాకా తవ్వుకుంటూ ఒక్క నీటి ఊటతో నాలుక తడుపుకుంటది రంగురంగుల పూల ఆకుపచ్చ చీర కట్టి చంకన కాకులూ ,కోకిలలూ , చిలుకలూ ,పిట్టల బిడ్డల్ని ఎత్తుకుని కూని రాగాల ఏకతా గానమాలపిస్తూ గాలిని గాంధర్వంగా మలిచే .. పెద్ద ముత్తైదువ చెట్టు మనిషి చరితకు వంశ వృక్షం ... చెట్టుకు చెదలు పట్టడమో , చిచ్చు పుట్టడమో .....అంటే మనిషికి పురుగు పట్టడమే!! ..... .......... ............................ @డా. కలువకుంట రామకృష్ణ
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUHuY0
Posted by Katta
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUHuY0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి