శ్రీస్వర్ణ || చీర || ఆరుగజాల చీరే .. పదహారణాల తెలుగుతనానికి భాష్యం చెప్పేది వ్యక్తిత్వానికి అద్దంపట్టేది ! కలనేత చీరలో.. మెరిసే కన్నె సింగారాలు పట్టుచీరల రెపరెపల్లో పలుకేరాని వైనం వలచిన ప్రియునికి ! చెంగావి చీరలో.. దరహాసాల చంద్రవంకలా దరిచేరమని సంజ్ఞలు చేసే రసరాణియై నిలిచేవు మనసుని దోచిన మనోహరుని కడ ! అద్దాల చీరలో.. మెచ్చిన సఖుని రూపం వేల ప్రతిబింబాలై పదమంజీరాలని మీటగా తిలోత్తమనే మరిపించేవు ! కంచిపట్టు చీరలో.. నడకలో జీరాడే కుచ్చిళ్ళలో వినిపించే తంజావూరు వీణానాదాలకు నర్తించే వనమయూరివై అలరించేవు ! సిల్క్ చీరలో.. నక్కీలు, చమ్కీల తీగలై పెనవేసుకుపోయేను నీ మన్మధుడే ! మంగళగిరి చీరలో.. మదిలో దాగిన మమతల క్షీరధారలు ప్రియ వల్లభుని మానసంలోపొంగిపోర్లేను మధువుల జల్లులా ! పువ్వుల చీరలో.. వనదేవతవై ఎదను సతతహరితం చేసేవు. ప్రతిఋతువులో వసంతాన్ని కళ్ళకి చూపించేసేవు !
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oVYE8y
Posted by Katta
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oVYE8y
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి