పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఏప్రిల్ 2014, శనివారం

Ravela Purushothama Rao కవిత

ముసళ్ళ పండుగ ---------------రావెలపురుషోత్తమరావు. వచ్చేరోజుల్లో మనకు చీకటిరోజులే దిక్కంట కొవ్వొత్తులగుత్తినో బుడ్డిదీపాన్నో కొని తెచ్చుకుంటే నయమేమోనేమో నని అతడి ఆశ ఆపైన అంతుజిక్కని వెంపర్లాట. బుడ్డి దీపానికి గబ్బుసమురేడనుండి తెస్తావ్? నీ బాబేమన్నా కంట్రోలు దుకాణం పెట్టాడా? కంట్రోలు దుకాణానికేళ్ళి క్యూలో నిలబడి గుమ్మం ముందుకు పోగానే కార్డేది అంటాడు బిక్కముఖం వెంట బెట్టుకుని వట్టి చేతులూపుకుంటూ ఇంటిదారి పట్టి కాళ్ళీడ్చుకుంటూ చెవులు జాడించుకుంటూ రావాలి. డాబాఇళ్ళల్లో కారుషెడ్డులో ఉన్నాసరే కార్డు మనకు రాదని రెవెన్యూ బాబయ్య మొన్ననే జెప్పాడు. పూరికొంపలో ని పేదవాడింట్లో పొయ్యిలో పిల్లిలేవాలన్నాకూడా ఆధారు కార్డు అవసరమంట--రీఫిల్ కావాలన్నా ఇంటి ఫోను ద్వారానే బూక్ చేయాలంట గ్యాస్ కంపెనీ వాడు కేకలేస్తూ మరీ చెప్పాడు ఇప్పుదర్ధమయిందా-- ఈ ప్రజాస్వామ్య దేశంలో సామాజిక న్యాయం చప్పబడి చావుకు దగ్గరగా చేరిందని. ఇప్పుడూ అవే కష్టాలూ కడగండ్లూ కవలల్లా పెనవేసుకుని బదుకునీడేరుస్తున్నాయ్-- కొత్త జెండాలు చేతబట్టుకుని కోట్లలెక్కకు సీట్లను కొనుగోలు చేసే ప్రజాస్వామ్యదేశంలో ప్లస్తిక్ నవ్వులతికించుకుని సిగ్గూ శరాన్ని ఇంట్లో ఇనపపెట్టెలో దాచేసుకుని ముఖానికి కొత్త గా జేర్చుకున్న పార్టీ రంగులేసుకుని వచ్చే ఎన్నికలల్లో వోట్లు అడిగే వాడి సమరధత--సౌశీల్యాని గమనించి మరీ నీ పవిత్రమైన వోటు అపవిత్రంకాకుండా చూడు. పట్టు బడ్డ నోట్ల కట్టలన్నీ నీ భవిష్యత్తును అంధకారమయం జేసే మారక వస్తువులుగా నిన్ను కొనేందుకనీ తెలుసుకో. ఇప్ప్టికే నిన్ను అలముకున్న చీకట్లు చాలు కొతావి కొని తెచ్చుకో పనిలేదని గ్రహించు. -----------------------------------------------------------------12-4-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQjRAe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి