పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఏప్రిల్ 2014, బుధవారం

DrAcharya Phaneendra కవిత

రచయితలు తమ ముద్రిత గ్రంథాలను అమ్ముకోవడం ఎలా? 1. మొదట ... ముద్రణకు ముందే రచయిత నిష్పక్షపాతంగా ఆ గ్రంథానికి ప్రచురణ అర్హత ఉందా? .. లేదా? ... అని బేరీజు వేసుకోవాలి. రచనలో పటుత్వం ఉంది ... నలుగురికీ నచ్చుతుంది ... అనుకొంటేనే పెట్టుబడి పెట్టాలి. ముద్రణ సమయంలో గ్రంథం కాస్ట్ ప్రైజ్ కన్న ధర నాలుగింతలు ఎక్కువగా ముద్రించాలి. "గ్రంథం లభించే చోటు" అంటూ - స్వీయవిలాసంతోబాటు కొన్ని వివిధ నగరాల, జిల్లాలలోని ప్రసిద్ధ బుక్ షాపుల అనుమతితో, వారి వారి చిరునామాలను కూడా ఆ గ్రంథంలో ముద్రించాలి. 2. గ్రంథావిష్కరణ రోజు 'సగం ధరకే' అని ప్రకటించి, అమ్మడం వలన కొన్ని అమ్ముడు పోతాయి. లేదా "కొత్త పుస్తకం కొంటే కొన్ని పాత పుస్తకాలు (అమ్ముడు పోనివి) ఉచితం" అని ప్రకటించడం మరొక పద్ధతి. ఇలా బోణీ కొట్టవచ్చు. 3. తరువాత సమీక్షలు వివిధ పత్రికలలో వచ్చాక, కనీసం ఒక పది ఊళ్ళ నుండి గ్రంథం పంపమని లేఖలు వస్తాయి. వారికి “సగం ధరకు, ఇంకా పోస్టేజ్ ఫ్రీగా పంపుతాము” అని ... “డబ్బును ఎం.ఒ. చేయ”మని కార్డు ముక్క వ్రాయాలి. అలా కొంతమందికి అమ్మవచ్చు. 4. ఆ పైన తక్షణం డబ్బును ఆశించకుండా, గ్రంథంలో ముద్రించిన బుక్ షాపులలో 50 ప్రతుల చొప్పున ఉంచాలి. ఒక సంవత్సరం తరువాత తీరుబడిగా వెళ్ళి, అమ్ముడు పోయిన గ్రంథాల డబ్బును (ఆ షాపు వాళ్ళ కమీషను పోను మిగిలింది) తెచ్చుకోవచ్చు. 5. వివిధ నగరాల, జిల్లాల, గ్రామాల, విద్యాసంస్థల గ్రంథాలయాలకు వెళ్ళి కొన్ని ప్రతులను అమ్ముకోవచ్చు.(సాధారణంగా 40% డిస్కౌంటుతో) 6. కొన్ని కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాళ్ళ అనుమతితో తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు, సాహిత్యాభిరుచి గల విద్యార్థులకు కొన్ని ప్రతులను అమ్ముకొంటే కొంత డబ్బు వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపాళ్ళకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ఇచ్చి ప్రసన్నం చేసుకొని, విద్యార్థులకు 'సగం ధర' అంటే చాలా డబ్బే మూటగట్టుకోవచ్చు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను సంస్థ సిబ్బంది మరుసటిరోజు పుస్తకం కొనుగోలుకై డబ్బు పట్టుక రావాలని శాసించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 7. వివిధ సాహిత్య సభలలో, ఎగ్జిబిషన్లలో, బుక్ ఫేర్ లలో పెట్టే పుస్తక విక్రయం స్టాళ్ళలో వాళ్ళ కమీషన్ రేట్ల ప్రకారం ఒప్పుకొని ఉంచితే, కొంత డబ్బు వస్తుంది. 8. వివిధ పురస్కారాల వివరాలు తెలుసుకొని పంపితే, బహుమతి లభించే స్థాయి ఉంటే, పెద్ద మొత్తమే చేతికందుతుంది. 9. రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయాల కొనుగోళ్ళ ప్రకటన ఎప్పుడు వచ్చేది కాస్త గమనించి, అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా మంచి మొత్తమే లభిస్తుంది. 10. చివరగా .. బంగారు కోడిపెట్ట వంటిది 'రాజా రామమోహనరాయ్ ఫౌండేషన్' వారి ప్రకటన! అది ఎప్పుడు వెలువడేది గమనించి అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా చాల పెద్ద మొత్తమే మన అకౌంటులో వచ్చి పడుతుంది. 11. ఈ మధ్య 'కినిగె ' వంటి సంస్థలు ఇంటర్నెట్ ద్వారా కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు. వారిని కూడా సంప్రదించవచ్చు. కొంత లాభం ఉండవచ్చు. అయితే వీటన్నిటిలోకి ప్రధానమయినది - నా 1వ సూచనే! పటుత్వ రచనను ముద్రించిన ఏ రచయిత కూడా - లాభం పొందినా .. పొందకపోయినా..., నష్టపోడని మాత్రం కచ్చితంగా చెప్పగలను. --- &&& ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLnd1O

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి