పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఏప్రిల్ 2014, బుధవారం

Sravana Saineni కవిత

"శ్రవణ సాయినేని" "వాహ్...తాజ్" తాజ్ మహల్ గొప్పప్రేమకు చిహ్నం ------------- -------------------- పండు వెన్నెల ముసుగులో తాజ్ ముంగిట ప్రపంచాన్ని తప్పించారు అందమైన ఒక ప్రేమ కావ్యపు దారుల్లోకి ------------- ------------------ వెన్నెల రాత్రుల్లో కాదు ఒక్క సారి ఎర్రటి ఎండలో నిల్చొని చూడండి ఒక పురాతనమైన చెమట చుక్క మెరుపు కనిపిస్తుందక్కడ ------------- -------------------- ఆకలి పునాదుల మీద కట్టిన ఏ మాన్యుమెంటును చూసినా బిగించి ఎత్తిన రోజుకూలీ పిడికిల్లా అనిపిస్తుంది ------------- -------------------- ఎన్ని గరుకు చేతులు నిమిరితే ఇంత నునుపు తేలిందో ఈ కట్టడం ------------- -------------------- ప్రతి సాయంత్రం ఇక్కడ గుభాలించే అత్తరు ఆవిర్ల వెనుక ఎన్ని చెమట చుక్కల పరిమళాలున్నాయో ------------- -------------------- పాలరాతి బరువుల కింద కోటి ఆశల పాలబుగ్గలు ఎన్ని చితికిపోయాయో ------------- -------------------- రాళ్ళ పాలైన రత్నాలన్నీ అన్నం మెతుకులుగా మారిన చారిత్రాత్మక సందర్భం ------------- -------------------- ఆకలిని ప్రేమించేవాడికన్నా గొప్ప ప్రేమికుడు ఎవడుంటాడు ----------------- ------------------- అన్నం కలుపుకున్నంత అపురూపంగా పాలరాళ్ళను పేర్చి వుంటారు అందుకే తాజ్ కంత అందం ------------- -------------------- నేనైతే తాజ్ మహల్ కంటే అన్నం ముద్దే అందంగా వుందంటాను ------------- -------------------- అవును తాజ్ మహల్ గొప్ప ప్రేమకు చిహ్నం --------- తరతరాలుగా ఎండిపోయిన డొక్కలకు రొట్టె మీద ఉన్న ప్రేమ అది ---------------- ------------------- వాహ్ ....తాజ్. ------------------- --------------------- 9-4-14 (వెన్నెల రాత్రుల్లో తాజ్ మహల్ సందర్శనకు అనుమతిచ్చినప్పటి ఒక పాత వెన్నెల్లో తాజ్ ఫోటో చూశాక ..... )

by Sravana Saineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsfFD7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి