పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఏప్రిల్ 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

My poem at saranga http://ift.tt/1juBWig ప్రాణం ----- నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద గర్భస్రావమైనట్టు దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి దేహం తనలోకి దిగమింగడానికి ప్రయత్నిస్తూనే ఉంది రాలిపడ్డ రక్త మాంసాలను మిగిలిన కొన్ని శకలాలు వాటంతట అవే ఆకాశంలోని కొన్ని అంచులను తాకుతున్నాయి ఇప్పుడిప్పుడే నేను చూసాను మళ్ళీ పసికందు ఆత్రాన్ని ఓ కీచు శబ్ధాన్ని తల్లి రొమ్ములో కుతిక నింకున్న ఓ జీవాన్ని ఆబగా దప్పిక తీర్చుకుంటున్న కణాన్ని నేను చూసాను దేహ ప్రక్షాళన గావిస్తున్న ఒక పదార్థాన్ని పరాన్న జీవి దశ నుండి పరిణమం చెందిన గుండెరెక్కల చప్పుళ్ళను ఇంకా కంటూనే ఉన్నా రాలిపడుతున్న కొన్ని మాంసపు ముద్దలను నా కళ్ళనుండి నెత్తురు ఉబికినప్పుడల్లా.. తిలక్ బొమ్మరాజు

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1juBWig

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి