స్రవంతి ఐతరాజు "సౌగంధిక జాజరలు" 19.3.14 మల్లెల్లో మహాలక్ష్మి... మల్లెల్లో మహాలక్ష్మివి మందారాల్లో మహంకాళివి సంపెంగల్లో శ్రీమహాసరస్వతివి ఓ పెద్దమ్మా! శ్రీ పద్మావతమ్మా.. నీ వదనమొక బింబ పద్మం నీ అక్షులు పద్మరేకులు వెరసి నీ నాసిక ఓముకుళిత పద్మం నీ పెదవులు పద్మవర్ణ తొటిమలు నీ చల్లని ధృక్కులు పద్మసుగంధాలు చిలుకరింపగరావె మాదు లోగిళ్ళందు పారద్రోలి మా అజ్ఞానపు అహంకారపు కనుల పొరల దొంతరలు కురిపింపగరావె నీ చైతన్య స్రవంతులు అష్టలక్ష్ములై అష్టదిక్కుల మము అష్టైశ్వర్యాల ముంచి ఆనందాల అలరింపజేయుచూ అభాగ్యుల ఆదరించ మా మనములరంజింపగరావె వ్రేడెద నా మనోపద్మమును నీ పాదపద్మముల భక్తితో సమర్పించుచూ గైకొనుమమ్మ మా అమ్మలగన్నయమ్మ.. దయతోడ మము పరిపాలింపగ రమ్మా..
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzrZ0q
Posted by Katta
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzrZ0q
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి