పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Abd Wahed కవిత

గగనాన్నే పట్టుకుని ఇంటిలోన పెంచుకునే ఆశా రహదారిని చేయిపట్టి మనతోనే ఉంచుకునే ఆశా ప్రయాణమే ముఖ్యమైతె గమ్యంతో పనేలేదు మనకూ మనలోపలి దారుల్లో దూరాలను దాటుకునే ఆశా నీడలాగ పెరుగుతున్న వయసులోని చీకట్లను చూసీ చిన్నప్పటి చిరుదీపం వెలుగులనే దాచుకునే ఆశా రాత్రిపగలు గోడల్లో పునాదిగా నిలబడడం మానీ రెక్కవిప్పి కాలంతో వేగాన్నే పంచుకునే ఆశా నెత్తుటిలో ప్రతిబొట్టూ నిప్పురవ్వగా మారేదెపుడో ఎండుగడ్డి దేహంలో మంటలు రగిలించుకునే ఆశా దారిలోన దోపిడైన సాహసాల సంపదలను వెదికీ మరోసారి ప్రమాదాన్ని వెదికిమరీ పట్టుకునే ఆశా చింతిస్తే లాభమేమి లోపాలను తలచి వగచి వగచీ లోటుపాట్లు బలాలుగా దియామనం మార్చుకునే ఆశ

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gDxXzt

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి