మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు ఎవరికీ పుడతామో అసలు తెలియదు ఆకలితో కడుపు నేప్పితో అడగటం తెలియదు ఎవరిని చూస్తున్నామో అసలు తెలియదు ఎవరు ఏమౌతారో చెపితే కానీ తెలియదు ఐదేళ్ళ ప్రాయం లో బడికి ఎలా వెళ్ళాలో తెలియదు పక్కన వాళ్ళతో ఎలా మెలగాలో తెలియదు చదువు అయిపోతే ఏమి చెయ్యాలో తెలియదు ప్రతిదీ అమ్మ నాన్న చూస్తుంటే నేను ఏమి చెయ్యాలో తెలియదు వంద మంది ముందు కూర్చోబెట్టి చూపులు అంటే తల ఆడించటం వాళ్లకు కావలసిన అంశాలు వుంటే ఆ అపరిచితునితో వివాహం అంతా తెలిసిన నా వాళ్ళ నుండి ఎవరు తెలియని కొత్త కుటుంబం లో క్రొత్త పరిచయాలు , పరామర్సాలు తెలుసుకోవాలి అప్పటి దాకా నాకోరకై వున్నా వాళ్ళు బంధువులు గా మారితే నాది అనుకున్న ఇంటిలో నేనే పరాయినై పొతే కొత్త మనుషులతో సర్దుబాటులు సరిచేసే మనుషులు లేక చావా లేక బ్రతకలేక ఇమడ లేక ఉండలేక చెప్పలేక అర్ధం కాని జీవితం అనుభవించే కంటే నా ఇల్లే మంచిది భావన తో వివాహబందం తెగతెంపులు చేసుకుంటే నా ఇంట్లోనే నాకు శత్రువులు , నా వాళ్ళే నాకు అపరిచితులు నిన్న నవ్వినా నా మోమే నేడు వేదన అనుభవిస్తే నా ఇంట్లోనే నా వాళ్ళ మధ్య ఒంటరి జీవితం ఇదీ ఒక నరక భావనే కదా .. ఈ నరకం కంటే అక్కడ మరణం మేలా లేక ఇలా జీవచ్చవం లా జీవించడం న్యాయమా ... దీనికి పరిష్కారం వున్నదా ... నా బాధలో న్యాయం ఉందా !!పార్ధ !!18mar 14
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1LH5P
Posted by Katta
by Pardhasaradhi Vutukuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1LH5P
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి