పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Krishna Mani కవిత

భూ’తాలు’ ********** నాలోని ప్రతి కణం పంచభూతాల సంగమం అమ్మ ఈ ప్రసాదాలతో కూర్చింది కడుపున అందుకే అందురేమో పంచభూతాల సాక్షి ! ధరణి పై కాలు మోపి ఉచ్వాస నిశ్వాసలతో ఆటలాడి నింగికి చేతులెత్తి తారలతో పాటపాడి వర్షంతో సరసమాడి తుదకు మంటల్లో పెనుగులాడి ఇందులో పుట్టి ఇందులో పెరిగి ఇందులోనే లయం ఇదే కదా ధర్మం ! బహుశా ! ఆ ధర్మాన్ని అతిక్రమణ జరిగిందేమో ఇంతింత రా నాయన అంటే ఇల్లంత వచ్చిండని ప్రకృతి ఒడిలో రాగానే మనిషి పంచాభూతాలపై పెత్తనం మొదలుపెట్టాడు ! వనాలను నరికి కొండల్ని వంచి అణు అగ్గితో ఆటలాడుతూ పైత్యమేక్కి ప్లాస్టిక్ను పరిచి గొట్టాల్లో కంపుని నింగిలో జల్లి ఓజోన్ను తెంపి కాంతి మలినాన్ని దింపి పాపం ఎరుగని జీవుల బతుకు చెరిపి మంచుకొండలను మాడగొట్టి మురికిని నీటిలో కలిపి వాగుల వంకల ఆరబెట్టి కల్మషంతో కడలిలో స్మశానం సృష్టించి ధరణిని దగ్ధం చేస్తున్నాడు ! తల్లిని దిక్కరించి ఒంటినిండా గాయాలు చేస్తే ఉండునా ఓర్పుతో ఎంతనీ ? రుద్రతాండవం చేస్తుంది చూడు ! బడబాగ్ని రాలంగ కాలం కాలిన కట్టెలే గాలి కౌగిలిలో సమస్తం తెగిన పటాలే జడసిన భూమి పగులును పక్కున ఉప్పొంగును అగ్ని స్రావం బిక్కు బిక్కుమనే దిక్కుతోయని జీవజాలం కడలి కెరటాల పొంగులో కడతేరే భయ కన్నులెన్నో ! గొడుగు లేని లోకం గగన శకలాల వర్షంలో ! ‘’అహంకారమే అంతానికి ఆది బిందువు ‘’ తెలివి నా సొత్తని విర్రవీగే మానవ కాకులు పంచభూతాలకు పట్టిన భూతాలు లోకాన్నేలే రాజులమని పులిపై స్వారి చేస్తే ఎందుకు పట్టదు అధోగతి ? ఎందుకు కూలదు జీవజాతి ? కృష్ణ మణి I 19-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2fUq2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి