కెక్యూబ్ వర్మ ॥ వాడో నవ్వుల దీపం ॥ వాడెప్పుడూ అలా నవ్వుతూనే వున్నాడు బాల్యం నుండి ఈ రోజు వరకు వాడెప్పుడూ అలా వెన్నెలలా తెల్లగా నవ్వుతూనే వున్నాడు దేహమంతా నరాలుదేరి కొవ్వన్నదే పట్టని పక్కటెముకలతో నల్లగా నిగ నిగ లాడుతూ వాడెప్పుడూ అలా ఇరిడి బొమ్మలా నవ్వుతూనే వుంటాడు మట్టిని పిసికి మట్టిని పీల్చి మట్టిని తిని మట్టితోనే బతుకంతా పెనవేసుకుంటూ వాడెప్పుడూ అలా మట్టి దీపంలా నవ్వుతూనే వుంటాడు నాతో పాటుగా వాడి వయసూ పెరుగుతూనే దూరంగా పోతున్న నన్ను చూసి వాడు అలా నిటారుగా ఆకుపచ్చ చందమామలా నవ్వుతూనే వున్నాడు వాడలా నవ్వుతూ వున్న సమయమే నాకెప్పుడూ మరో వసంతాన్ని హామీ యిస్తూ వాడితో పాటు నేనూ నవ్విన క్షణం నాలో వేయి దీపాలను వెలిగిస్తాడు (తే 18/03/2014 దీ 10.20 PM)
by Kumar Varma K K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OtvBJ4
Posted by Katta
by Kumar Varma K K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OtvBJ4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి