కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక || ప్రతినెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక సమావేశం బి.వి.కె. గ్రంథాలయంలో కపిల రాంకుమార్ మాట్లాడుతూ కవిత్వం - శిల్పం అధ్యయనంలో భాగంగా సుధామ వ్రాసిన చిత్రగ్రంథి సంకలనం నుండి వివరన అనే కవితను వినిపించారు. ఈ సమావేశం కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా డా.పొత్తూరు వేంకట సుబ్బారావు అతిథిగా విశ్లేషణ చేయటానికి, చర్చను కొనసాగించటానికి కన్నెగంటి వెంకటయ్య, రౌతు రవి వేదిక అలంకరించారు. చర్చను ప్రారంభిస్తూ డా.సుబ్బారావు గారు సుధామ కవిత్వం చిత్రగ్రంథి అనేపేరే శిల్పానికి సంబంధించినదని, శ్రీహర్షుడు తన హర్ష నైషధంలో గ్రంథిస్ అనే పదాన్ని ఉపయోగిం చాడని, అది యోగవిద్యకు సంబంధించదని తెలిపారు. కవికి ప్రతిభ, ఉత్పత్తి పుష్కలంగా వున్నపుడు అద్భుతమైన కవిత్వాన్ని సృష్టిస్తాడని, లోక దృష్టి, లోక స్వభావం తెలుసుకోటం ద్వారానే అటువంటి అసమాన సృజన జరుగుతుందని తెలిపారు. పఠన, పాఠనం ద్వారానే సాహిత్యాన్ని సృష్టించకలుగుతాడని తెలుసుకోవాలన్నారు. సంవిధానం(శిల్పం)లో శ్రీశ్రీ దిట్ట. పద లక్షణాలు సుష్టుగా ఉపయోగించగలనేర్పరి కాబట్టి ఆయన పఠన, పాఠనాన్ని బాగా అల్లగలిగాడు. బ్రహ్మ గ్రంఠి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనేవి మూడు యోగానికి చెందినవి. ఒక కవి యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటే ఆ కవి హృదయలోకి మనం వెళ్ళవచ్చు, రూపం, బాహ్యం రసం అంతర లక్ష్యణం. రూపం అనేది భావాన్ని బట్టి వస్తుంది. కవిత్వం లోకానికి అద్దం వంటిది. అందుకే లోకాన్ని కవి నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వస్తువుకు తగ్గ సరియైన రూపాన్ని ఇచ్చినపుడే మంచి కవిగా రాణిస్తాడు. ఆశ్చర్య చకితులను చేసేదే చిత్రం అంటాము ( రూపమే శిల్పం కదా) నీది కాని విషాదం లేదా ఆనందాలను నీలో ప్రేరేపింపకలిగించడమే కవిత్వం, లేదా కవిత్వ గొప్పదనం. ప్రతిభ కవికి, చిత్రకారుడికి, గాయకుడికి వుండాలి. Imaginations are two అందులో ఒకటి primary రెండోది secondary . ఆకారమును చూసి మోసపోకూడదని అని మనం గుర్తించాలి. అందుకే కవి అనధికార శాసనకర్త అని కూడా నిర్వచించారు. జీవితం మీద ప్రేమను పెంచాలి కవిత్వం. స్వాంతనమైన సాంత్వనము కలిగించాలి ( ఓదార్చే హృదయాన్ని) అంటూ చక్కటి సోదాహరణలతో వారి విశ్లేషణ ముగిసింది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ చిత్రగ్రంథి పై చక్కటి విశ్లేషణ చేసారు. మాకు తెలియని విషయాన్ని విడమర్చి చెప్పారు. చాల కొత్త విషయాలను కూడా సుబ్బారావు గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటూ కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలు వివరించిన ర్తీరు బావుందని శిల్పంపైనే ఇవాళ చర్చ బాగ జరిగిందని అభిప్రాయం తెలిపారు. చర్చలో పాల్గొన్న సాహితీ స్ర్వంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి '' చిత్ర గ్రంథి ' పై చక్కటి విశ్లేషణ చాల బావుంది అంటూ '' మాక్సిమ్ గోర్కీ '' చెప్పినట్లు అవబోధనా శక్తి, బోధనాశక్తి ప్రతి మనిషిలో వుంటాయని, అవి మనిషి తనను తాను కాపాడుకోటానికి, పరిశీలనకు, మరింత లోతైన అవగాహనకు దోహదపడటాయని చెప్పాడన్నారు. ఊహించటం, అనుభూతిగా మార్చుకోటం, సత్యంగా ఆవిష్కరించడం ఎవరు నేర్పుగా చేస్తారో వారు తమ కవిత్వం ద్వారా లోకాన్ని ప్రభావితం చేస్తారని, జీవితం నవనవోన్మేషaగావుండే రీతిలోనే శిల్పానికి వుండే ప్రధాన్యత తెలుసుకొని బాగా అభ్యాసం చేయాలని, నిత్యం మారుతున్న సమాజాన్ని నిశితంగా పరిశీలించనిదే సజీవ సాహిత్యం రాదని తన చర్చను ముగించారు. చర్చపై సునంద, సంపటం దుర్గా ప్రసాద్, బండారు రమేష్, డా. ఆంజనేయులుం ఎం. శేషగిరి, శైలజ, బషీర్ మొదలగు వారు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. సంపటం దుర్గా ప్రసాదు వందన సమర్పణ చేస్తూ 31.1.2014 ఉగాది కవి సమ్మేళనం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని అనుకుంటున్నామని. సమాచారాన్ని త్వరలో తెలియపరుస్తామని, సాహితీ అధ్యయన వేదిక ఈ సమావేశం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత జరుపుకుంటున్న మొదటి సమావేశమని అందరికి శుభాకాంక్షలు తెలిపారు. /////19.3.2014 సాయంత్రం 4.50
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OwbE4f
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OwbE4f
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి