పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Chi Chi కవిత

_ఆనందం_ అదొక ప్రశ్నే!! ఒంటరై అందరిలో అన్నిట్లో వెతుక్కుంటూనే లేదనుకోవడంలో ఉందేమో.. కనిపించదు కాబట్టి లేదనుకోవాలా!! తనలో తానై అన్నీ తాననే అదోగతంలో ఉందనుకోవడంలో లేదేమో.. అనిపిస్తుంది కాబట్టి ఉందనుకోవాలా!! అనర్థాల కోరల్లో చిక్కి అంతం వెతుక్కునే అంధత్వానికి తెలీదు ఆనందానికర్థం వయసు పోకడలేసే అందాల కుయ్యో ముర్రోలలో కరిగిపోయేదా అది!! మన పైకప్పు తంటాలతో లోనున్న పెంట కప్పి తిరుగుతూ అద్దాల సాక్షిగా పొందే ఆనందంలో, శునకాలకు తీసిపోమేమో అయినా అద్దం చెప్పేది చాలదే.. ఊరంతా మొరగాల్సిందే మట్టి సిరులు చూసి!! మరందుకే (నేను)అనేది మనిషికున్నది రెండు కళ్ళు కావు మనుషులందరి కళ్ళు ప్రతి మనిషివీ అయున్నాయని.. చూస్కో!! బతికి, బతుకిచ్చి,బతకనిచ్చి,బతికే ఉన్నా చంపి,చచ్చి,చావనిచ్చి,చంపుకుంటూనే ఉన్నా తీర్చి,తీర్చుకుని,తీర్పులిచ్చి,తీట పెంచుకున్నా దైనందినానందం కోసమే!! అవికాదానందమనే వారికి మాత్రమే అవికాదానందం మరి వారికేదానందం? అవి కాదనటమే వారానందం.. lol!! ధ్యానం ,మౌనం,శూన్యం,జ్ఞానం,దైవం ఇంకా!! మా బొంద మాకేం తెలుసు..అవి try చెయ్ వస్తే ఆనందం , పోతే ఆరోగ్యం అని అన్ని మటాల్లో , మతాల్లో మనుషులు(?) మొత్తుకోడం చూసి వాళ్ళతో కలిసి వాళ్ళ భజనే చేస్కోడం తప్ప ఆనందమనే సమస్యకు సమాధానం మాత్రం పొందలేం.. hehe నిజానికి భజన చేసే భక్తులుండటమే మటాలకి ,మతాలకి ఆనందం లేదంటే వాళ్ళక్కూడా ఆనందమో సమస్యే _/\_ సుఖసంసారం గురించి ఎందుకులే సుఖం కోసం సంసారమో , సంసారమే సుఖమో ,సుఖమో సంసారమో బంధమే ఆనందమో , ఆనందం కోసం బంధమో , ఆనందమో బంధమో out of my coverage area!! సర్లే!! ఆనందమనే సమస్యకు ఆనందమే సమాధానమనర్థమైతే సమాధయ్యేదాక సమాజంతో సమస్యలుండవేమో_________Chi Chi (19/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCf5WK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి