నియమనిబంధనలు చదివే అలవాటు అంతగా లేనందువల్ల, నియమాలకు కట్టుబడే పొరబాటు చేయలేని అలవాటు వల్ల ... కవిసంగమంలో ఒకే రోజు రెండు కవితలు పోస్టు చేయవచ్చో లేదో నాకు తెలియదు. ఒకవేళ పోస్టు చేసే అనుమతి లేకపోతే మరోసారి ఈ తప్పు చేసేవరకు మన్నించాలని ఆడ్మిన్స్ ని కోరుకుంటూ... పనిపాటా లేకుండా ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంకో గజల్ రాసి పోస్టు కూడా చేసేస్తున్నా.... - వాహెద్ మనసు దూదిలా తేలిపోవడమే కాదు వేరే ఉంది బతుకు హాయిగా గడిచిపోవడమే కాదు వేరే ఉంది నా కన్నీటిని నీ కనుచూపుతో తుడవాలనుకున్నా నా చూపుల్లో కాలిపోవడమే కాదు వేరే ఉంది ప్రేమశిఖరాల పైకెగబ్రాకినా నిలబడాలని లేదా సుమగంధాలు రాలిపోవడమే కాదు వేరే ఉందీ చేతికి దొరకక అద్దంలోతులో కనిపిస్తూ ఉన్నా ప్రతిబింబాలు పారిపోవడమే కాదు వేరే ఉంది వలపుతలపులే లోకంగా మారిపోతే నీ లోనా ప్రేమమత్తుగా వాలిపోవడమే కాదు వేరే ఉంది కురుల నీడలో చెంపలవెలుగులో నిశ్చింతలు భ్రమలే గుండెఎండలో మండిపోవడమే కాదు వేరే ఉంది ఆకలిదప్పుల తీరాల మధ్యన ప్రవహించే నదిలో ప్రేమగా దియా మునిగిపోవడమే కాదు వేరే ఉంది
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fagi1w
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fagi1w
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి