పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Santosh Kumar K కవిత

||నీ రాకతో|| నీ చిరునవ్వులో విరిసిన రంగులను చూసి కనులు మూసి బోసిపోయింది ఆ హరివిల్లు... నీ తలపుల్లో తలమునకలైన నా ఆలోచన అలుపెరగని ఊసుల కారగారంలో బందీగా మారిన నిమిషంలో... నా తీరే కొత్తగా ఉంది.. నీ ఉనికిని పసిగట్టిందేమో..! నా మనసు మౌనం వీడింది.. నీ మాటలను విన్నదేమో..! నా ఊహ ఊపిరి పోసుకుంది.. నీ శ్వాస తగిలిందేమో..! నా ప్రేమ తొలి అడుగులు వేసింది.. నీ నడకలో చేరిందేమో..! అలా నేను ప్రేమించటం మొదలుపెట్టిన క్షణం నుండి... కవ్వించే నీ కౌగిలిలో చేరుకోవాలని గమ్మత్తుల మత్తులో తూలుతూవున్నా..! సోయగాల పూలు పట్టుకోవాలని పులకింతతో నీ కురులవైపే చూస్తూవున్నా..! వెచ్చని ఒడిలో కాసేపు సేదతీరాలని చలిగాలిలో సైతం నీ చెంతకు చేరాలనుకుంటున్నా..! అంతటిలో తొలకరి మేఘమై చేరవచ్చి.. వేచిచూస్తున్న ఎదపై తేనెజల్లు కురిపించావు, మంచులా మారి ప్రణయ మారుతంలా వీచి.. కలలలో విహరిస్తున్న నన్ను పలకరించావు, పరిచయం చేసుకున్నావు, పునర్జన్మనిచ్చావు!! #సంతోషహేలి #Sanoetics http://ift.tt/1jvhwEF

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jvhwEF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి