కవిసంగమం -సీరిస్ 13 గురించి :కొన్ని మాటలు ........................................................ దాదాపు 70నుంచి 80 మందిదాకా మిత్రులు హాజరయ్యారు. హెచ్చార్కె,ఖాదర్ మొహియుద్దీన్ ని చాలా కాలం తర్వాత కవిత్వం చదువుతూ ఉంటే వినడం. నాకు కూడా అదొక ఎగ్జయిటింగ్ అనుభవం. ఖాదర్ గారూ,హెచ్చార్కె తమ కవిత్వ అనుభవాల్ని పంచుకుంటూ,కవితలు చదువుతూ ఉంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. ఖాదర్ తన ఇతర కవితలతో పాటు ' పుట్టుమచ్చ' దీర్ఘ కవితను వినిపించడం మరిచిపోలేని అనుభవం. హెచ్చార్కె మాటలు,కవితలు అద్భుతం. లోలోపలి ప్రపంచపు సంభాషణలా అన్పించింది -ఆయన మాట్లాడుతుంటే !. కవితల్ని,జీవితాన్ని అనుసంధానం చేస్తూ ఆయన కవిత్వం వినిపిస్తున్నప్పుడు ,ఆయనతో పాటు అందరూ ఒకానొక ట్రాన్స్ లో ఉన్నట్లుగా అనిపించింది. ఎన్నుకున్న కవితలు, వాటిలోని తాత్వికదృష్టి, కవిత్వం చేసిన విధానం -సింప్లీ సూపర్బ్. యువ కవిమిత్రులు విజయ్ కుమార్ svk, మధు ఇరువూరి తమ తమ కవితలతో ఆకట్టుకున్నారు. విజయ్ చదివిన కవితల్లోని నిగూఢత, కవితని నిర్మించే తీరు గొప్పగా అన్పించాయి. మధు కవితలకున్న ప్రత్యేకత సామాజిక దృష్టి. తనకున్న సామాజిక అవగాహనను ,ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న విధాన్ని తన కవితలుగా మలుస్తున్నాడు. వీరిద్దరూ మొన్నటి కవిత్వ పఠన అనుభవాన్ని జీవితాంతం మనసుల్లో పదిలంగా దాచుకుంటారు. మరో ప్రత్యేకత - చాలామంది కొత్తగా రాస్తున్నవాళ్ళు ,చదువుతున్నవాళ్ళు హాజరవ్వడం. సభ ముగిశాక వాళ్ళతో మాట్లాడినంత సేపు మనసు ఉప్పొంగింది. కవిత్వం పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, సభ జరిగాక కవిత్వ పఠనంపై తమ ఇంప్రెషన్స్, అనలైజ్ చేసిన విధానం -ఇవన్నీ కవిసంగమం శ్రమకోర్చి జరుపుకుంటున్న ఈ సీరీస్ కవిత్వ పఠనం గురించి గర్వంగా ఫీలయ్యేటట్లు చేసాయి. ఏదో కొత్తశక్తి అవహించినట్లుగా ఫీలయ్యాను. కవిత్వం కోసం ఇలా అందర్నీ కలుపుతూ,కలుస్తూ సాగడం; కవిత్వంపై ఇలా నిత్యం సీరిస్ సభలు నిర్వహించడం వలన ప్రయోజనం కలుగుతోంది అని అన్పించింది.
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNcrev
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNcrev
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి