మొగిలిపూల సుగంధం-సినారె __________________అరుణ నారదభట్ల కదిలే ఓ సాహిత్యాలయం పాటల పూదోట! పుట్టే ప్రతి చిగురూ నునులేత కాంతిరేఖే... విరిసే ప్రతి అక్షరం తన హృదయాన్ని తాకినందుకేమో మరో కాంతి పుంజమే! సినీ జగతిని వెలిగించిన పాలపుంత... ఎన్ని భావ చిత్రాలకు ఊటనిస్తుందో విశాల వృక్షంలా ఎన్ని గొంతుకలను తడిపిందో మిన్నంటే మనో వెలుగుతో....! ప్రేమగా కురిపించే అక్షరవానకు నల్లని మేఘమైనా చల్లని వెన్నెలైనా మత్తెక్కించే మల్లెలైనా ప్రజ్వలించే సూర్యుడైనా మరులు గొలిపే మకరందమై తన భావ గాంధర్వంలో కరిగిపోవాల్సిందే! మనో నాడులను వీణై మీటే పదబంధం ఎన్ని హృదయస్పందనల కలబోతో...మరి!! మదిని దోచే మాటల మూట పాటైనప్పుడు వినిపించే మృదంగ నాదం నిలువెత్తు ఆశా కిరణం ఆత్మవిశాసమై నడిచినప్పుడు మబ్బులు కిందికి దిగుతాయి.... ఆమని కోయిలలు కొత్తరాగాలు ఆలపిస్తాయి నింగిలోని చందమామ పగలే వెన్నెల కురిపిస్తుంది జగమే ఆయనకు ఊయలలూపుతుంది!! 17-2-2014
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXyp6v
Posted by Katta
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bXyp6v
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి