కె.కె.//గుప్పెడు మల్లెలు-66// ********************* 1. బ్యాగులకు చక్రాలొచ్చాయ్, ఎర్రచొక్కాలకు కన్నాలు పడ్డాయ్, రైల్వే స్టేషన్లో... 2. పనికిరానిదేముంది లోకంలో, పుట్టగొడుగుల కూరే ప్రత్యేకం, ఫైవ్ స్టార్ హోటల్లో... 3. కంచెగట్టి కాపలా పెట్టొచ్చేమో, పూలతోటకి... మరి పరిమళానికో, ప్రతిభకి అవరోధాలెక్కడివోయ్ 4. కుక్కకూడా భయపడుతోంది, ముక్క లాక్కుంటాడేమో మనిషని, పరాకాష్ఠలో స్వార్ధం... అంతటా మని,మని 5. మార్పు అనివార్యం, అనుకున్నప్పుడే మొదలవుద్ది, ఓర్పుకి పరీక్షా ప్రహసనం. 6. వడదెబ్బ తగిలినోడికి, నీడనిస్తే చెట్టుకేంటి నష్టం, ఉన్నప్పుడు లేనోడికిస్తే, ఏంటి కష్టం 7. కుండైపోద్దా మట్టి, కుమ్మరి నడుం ఒంచకపోతే, బాధ్యత తేలికే, బరువనుకోకపోతే 8. తిరుగుతుంటేనే చూస్తాం గడియారం, ఎంత గోప్పదైతేనేం వంశం, పనిచెయ్యకుంటే లేదోయ్ గౌరవం. 9. అనుకున్నది అవుతుంటే, అంతా మనసత్తా అనిపిస్తుంటుంది, ఆగిందో, కర్మసిద్ధాంతం మొదలవుతుంది. 10. బజారుసరుకా శీలం కొనేందుకు, నిజాయితీ రక్తంగా మారాలి, అది పొందేందుకు...... ========================== Date: 16.02.2014
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MpQvYz
Posted by Katta
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MpQvYz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి