|| మాతృ దేవో భవః || 'శ్రీ' కవిత 11.05.2014 'అ' అంటే అమృతం 'మ' అంటే మమత ఈ రెండు అక్షరాల క్షమత 'అమ్మ' పదం అమ్మే నే పలికిన తొలి పలుకు అమ్మ స్పర్శే నే పొందిన తొలి ప్రేమ అమ్మే నాకు ఓనమాలు నేర్పిన తొలి గురువు అమ్మ పలుకు అద్వితీయం అమ్మ పలుకు కమ్మదనం అమ్మ పలుకు ఆచంద్రార్ఖం అమ్మ నిజమైన ప్రేమకి నిలువెత్తు రూపం అమ్మ నిజమైన కరుణకి కదిలే దైవం అమ్మ నిజమైన లాలనకి ఆలనా పాలనా 1. జనని నవమాసాలు మోసి పురిటి నొప్పులు పంటి బిగువున ఓర్చి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి జన్మనిచ్చే మాతృ మూర్తి తన బిడ్డ ధరణిపై అడుగిడుతూనే నొప్పులు మరిచి మురిచి గుండెలకు హత్తుకొని లాలిస్తూ ప్రేమని కురిపించే అమృత వర్షిణి 2. మాత ఏడవగానే తన రక్త మాంసాలు కరిగిస్తూ పాలిస్తూ పరవశించే ప్రియవదనం నిద్రాహారాలు మానీ తన బిడ్డకు పోశాకాహారాలిచ్చే అక్షయం చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కిరావే అంటూ గోరు ముద్దలు తినిపించే అన్నపూర్ణ రాగం రాకున్నా అనురాగంతో లాలిపాటతో అవలీలగా నిద్రపుచ్చే లాలిని ప్రియగామిని 3. తల్లి తప్పటడుగులు మాన్పి బుడి నడకలు నేర్పి బుజ్జగింపులతో నడవడిక మార్చే నేర్పరి ఓంకారంతో మొదలుపెట్టి అమ్మపేరుతో రాతలు దిద్ది తలరాతను మారేల శ్రమించే బ్రాహ్మణి చెడుగుణాలను తుంచి మంచిని పెంచి ఓటమిలో ఓదార్చి ఆత్మ విశ్వాసం నింపే స్పూర్తి ప్రదాత అమ్మ అని పిలుపు వినగానే ఎక్కడ ఉన్నా పరుగెత్తుకొని వచ్చి అక్కున చేర్చుకొనే ఆదరణీయ మూర్తి 4. అమ్మ ఏప్రతి ఫలం ఆశించని ప్రేమే అమ్మ ప్రగతిని ఆకాంక్షించే అభిలాషిని అమ్మ ఎంత ఎత్తు ఎదిగినా చంటి పాపలా చూసుకొనేది అమ్మ పేగుబంధంతో మొదలై మమతల బంధంతో మిగిలేది అమ్మ ఓ మాతృమూర్తి ఏలా తీర్చుకోగలను నీ ఋణం ఏమిచ్చినా తక్కువే అందుకే అందుకో స్వీకరించు నా వందనం పాదాభి వందనం ఓ జనని నువ్వు నాతో లేకున్నా నీ నామ స్మరణతోనే నా ప్రతి అడుగు నిన్ను తిరిగి తీసుకురాలేను కానీ నా కూతురులో నీ రూపాన్ని చూసుకుంటూ అమ్మా అని పిలుస్తూ అపురూపములా పెంచుకుంటూ కొంతైనా నీ ఋణం తీర్చుకుంటా ఆశీర్వదించు మాతృమూర్తులందరికీ... వందనం......!!.మాతృ దేవో భవః !!
by Sree Kavita
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fY1LbZ
Posted by Katta
by Sree Kavita
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fY1LbZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి