పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Murthy Kvvs కవిత

Mario Puzo మరొక నవల Sicilian పై నా అభిప్రాయం God Father తో ఒక ప్రత్యేకతని సంతరించుకున్న రచయిత Mario Puzo రాసిన మరి ఒక నవల Sicilian గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తాను.1950 దశకం నుంచి ఈ కధ మొదలవుతుంది.రెండవ ప్రపంచ యుద్ధ చ్చాయలు అక్కడడక్కడ తొంగిచూస్తుంటాయి.అయితే దాని గురించినదే కాదిది.సిసిలీ లో ని మాఫియా కుటుంబాల ప్రాభవం ముస్సోలిని అణచివేతవల్ల కొంత తగ్గినట్లుగా చెబుతాడు రచయిత.అయితే అమెరికన్ సేనలు ఫాసిష్టులను పారద్రోలి వారి అనుయాయులను అక్కడ ఉంచినట్లుగా అర్ధమఔతుంది.రోం నుంచి వాళ్ళు నిరంకుశంగా పాలన సాగిస్తుంటారు.Palermo అనే ఊరిలో ఇంకా Montelepro అనే ఊరిలో ఈ కధ అంతా నడుస్తుంది. మీరు గనక గాడ్ ఫాదర్ చదవక పోతే మొదట వచ్చే Michael Corleone పాత్ర గూర్చి ఏమి అర్ధం కాదు.అగమ్య గోచరంగా ఉంటుంది,అంటే దానిలో నుంచి దీని లోకి ముడి వేస్తాడు రచయిత,అయితే దానికీ అర్ధం ఉంది.అమెరికా లో Sonny ని చంపిన ఓ పోలీస్ ఆఫిసర్ ని పకడ్బంది ప్లాన్ తో అతని సోదరుడు Michael ఓ హోటల్ లో మట్టుపెడతాడు.ఆ సన్నివేశం ఊహించనలవి కాదు మొదట్లో. ఓ హోటల్ లో సంధి కోసం కోసం హాజరవుతారు.వచ్చినపుడు Michael ని బాగా చెక్ చేస్తారు.ఎక్కడ ఎలాంటి ఆయుధం ఉండదు.విచిత్రంగా ఆ సన్నివేశం చివరిలో పోలిస్ అధికారిని టపా మని కాల్చి పారేస్తాడు.అసలు విషయం ఏమిటంటే ఆ హోటల్ లోకి రాకముందే అక్కడున్న సర్వర్ కి డబ్బులిచ్చి ఓ పిష్టల్ ని బాత్ రూం లో పెట్టిస్తాడు...తను పాస్ కి వెళ్ళినప్పుడు అది లోపల పెట్టుకొని టేబుల్ ముందు కూర్చుని మాటాడుతున్నప్పుడు ఠపీ మని కాల్చి పారేస్తాడు.50 వ దశకం లో నే వాళ్ళ మెదళ్ళు అలా ఉన్నాయి. సరే... ఇక్కడుంటే ప్రమాదమని తన స్వస్థలమైన సిసిలీ లోని మరో డాన్ డాన్ క్రాస్ దగ్గరకి పంపిస్తాడు. రెండు సంవత్సరాలు అక్కడున్నతరవాత అక్కడినుంచి ఆఫ్రికా కి సముద్రం మీదుగా వచ్చి అక్కడినుంచి విమానం లో న్యూయార్క్ రావాలనేది గాడ్ ఫాదర్ ప్లాన్ . ఇలా జరుగుతుండగా Salvatore Guiliano అనే విప్లవకారుణ్ణి మైఖేల్ తను వచ్చేటప్పుడు తీసుకురావాలనేది అతని తండ్రి షరతు.దానికీ ఓ కారణం ఉంది.నిజం చెప్పాలంటే ఈ Sicilian నవల లో హీరో ఈ Guiliano నే.సిసిలో ప్రజలని రోం పాలకుల సహాయం తో వేధిస్తున్న Mafia families కి సిమ్హ స్వప్న స్వప్న మౌతాడు.సుకుమారమైన,అందమైన రొమాంటిక్ జీవితాన్ని గడిపే అతని జీవితం కొన్ని సన్నివేశాల ఫలితంగా విప్లవకరం గా మారుతుంది.భయంకరమైన మోసపూరితమైన రాజకీయ అండదండలున్న వ్యక్తులను తన ధైర్య స్థైర్యాలతో,ప్రజల సహకారం తో ఎత్తుగడలతో ఎలా తన ఊరుచుట్టూ యున్న కొండలను వేదికగా చేసుకొని పోరాడాడో చదివితే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. మనిషి లోని నమ్మించి మోసం చేసే తత్వం ఎంత లోతుగా ఉంటుందో ప్రతి పేజీలోను అర్ధం అవుతుంది.గులియానో తల్లి మారియా పాత్ర సగటి భారతీయ స్త్రీ లానే ఉంటుంది.Adonis పాత్ర దీనిలో గుర్తుండిపోయే పాత్ర. అతను యూనివర్శిటి ప్రొఫెసర్ గా పనిచేస్తూ తన ఒకప్పటి స్టూడెంట్ గులియానో కి సహాయపడుతుంటాడు.కొండల్లోని గులియానో కి అనేక చరిత్ర పుస్తకాలని అందించటం.... వారి చదివే గుణానికి ప్రతీక. చివరివరకు ఏమౌతుందోనని చాలా టెన్షన్ గా ఉంటుంది.ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో..అసలు చాలా వరకు అర్ధం కాదు.మంచిగా ఉన్నవాళ్ళే శతృవుకి సహకరించడం...హీరోకి అత్యంత దగ్గరగా ఉండి అనేక దాడుల్లో అతనికి సహకరించిన అతని బంధువు(Aspanu) ఒక చిన్న కారణం చేత గులియానో చావుకి కారణమవుతాడు. అది ఊహించలేము.అంటే మానవ పరమైన Loyalties ఎంత బలహీనంగా ఉంటాయో అవగతమౌతుంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా చెప్పవచ్చు.బయటకి చక్కగా మాటాడుతూనే ఒకరిని ఒకరు manipulate చేసుకోవడం చెప్పదగినది. ఎన్నైనా చెప్పండి......తెలుగులో ఎన్ని అనువాదాలు చదివినా యూరోపియన్ల యొక్క Treacherous నేచర్ అర్ధం కాదు.వారి పలుకుబడులు,ఉద్వేగాలు,మానవ సంబందాలు ఇది చదివితే బాగా అర్ధం అవుతుంది అనిపించింది.ఇంగ్లీష్ రచయితల్లో నాకు ,ముఖ్యంగా ఫిక్షన్ రైటర్స్ లో, నచ్చిందేమంటే కొన్ని విషయాలు ఎవరేమనుకుంటారో అని వదిలి వేయరు.

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU7Ji

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి