మడిపల్లి రాజ్‍కుమార్ //అమ్మ నా పాస్‍వర్డ్ // "మీరు అర్థంకారు" "అసలు మీరేంటో మీకర్థమౌతుందా?" "ఓ అర్థముండి ఏడిస్తేగా.." "వాడు వొట్టిమొండి""మూర్ఖుడు" "అమాయకుడు" "...."...." * నన్నెవ్వరూ అర్థం చేసుకోనప్పుడు.. అర్థం చేసుకోను కనీసమూ ప్రయత్నించనపుడు వాళ్లకు తోచిన ఆ ఘడియలో అనిపించిన ఎత్తిపొడుస్తున్నామనో.... ఆకాశానికి ఎత్తేస్తున్నామనో ఏదో ఓ అర్థాన్ని అంటగట్టినపుడు ఒక్కొక్కసారి నాకు నేనే అర్థంకానపుడు నేనేమిటో నాకే చూపే అద్దంలా నా మనసుకు అర్థం చెబుతూ ఆ అర్థాన్నే అందరికీ చూపుతూ అమ్మ.... నా నిఘంటువు. నేను బాధపడ్డా.. ఏడ్చినా.. కోపించినా తమాయించుకోలేక ఒంటి కాలిపై లేచినా అరిచి గీపెట్టినా.. తాను తలకొట్టుకుంటూనైనా నన్ను మారమంటూనే లోకానికి నా సాత్విక రూపాన్ని పరిచయం చేయజూస్తూ అమ్మ.... నా ఫోటోఫ్రేము ఒక్కమాటలో.. నన్ను నేనుగా నా బతుక్కే లాగిన్ కావడానికి పాస్‍వర్డ్ అమ్మ 11/5/2014
by Raj Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU4Nz
Posted by Katta
by Raj Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU4Nz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి