పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Jaligama Narasimha Rao కవిత

క్రొత్తగా.....తెచ్చుకున్నాము... కష్టాలెన్నో.....అవమానాలెన్నో...దిగమింగుకొని... యోధులమై.....సమిధలమై......బిగించిన...పిడికిలి...విధిలించక... సకిలించేవారి....నోర్లు...మూయించి.... వెక్కిరించినవారి......కన్ను...తెరిపించి..... క్రొత్తగా...తెచ్చుకున్నాము.....సంబరాలెన్నో...చేసుకుంటున్నాము... కల్లు..మూసుకొని....చేసిన...త్యాగాలు...మత్తులో..పులిమి...మరిచిపోతున్నాము... అసువులు బాసిన...త్యాగుల......నినాదాల..కేకలు.. ఇక ....వినపడవు... హోరెత్తించే...పోరు...ఇక...కానరాదేమో....... ఊతనిచ్చే....ఉరికించే....పాటల...పస వుంటుంధో...లేదో... నూతన...నిర్మాణం...మన..చేతుల్లో... రైతన్న...కంటి..నీరు...నేల రాలరాధు..... పసిడి..భూముల..అమ్మరాధు....కాంక్రీటు....పిల్లర్లు...అమ్మ..గుండెల్లో...దింపరాధు... ఇంటింటా....ఒక కుటీర పరిశ్రమ...స్థాపించవలెను.... చదువులేని..చదువుకున్న..వారు...వొక్కటై....ప్రచారం...సాగించవలెను... ప్రభుత్వం.....ప్రోత్సాహం...అంధించవలెను....శంఖం...పూరించే...రథం..నడిపించవలెను.... మన..ఆడవారి....గుండెల్లో...ఆత్మస్థైర్యం..నింపవలెను... మధ్యం...చేసే....పాపం...వీధి..నాటకాలతో....వీది...వీదినా...నిర్విరామంగా...ఆడవలెను... ఆర్తనాదాలు...మనుసుల...కలచివేసే...పాటలై....చైతన్యం..నింపవలెను.... విధ్యా..యజ్ఞం....చేయవలెను.... గ్రామ..గ్రామాన...గ్రంధాలయం..నెలకొల్పవలెను... వృత్తివిధ్యా పెంపొంధించవలెను..... నిధ్రిస్తున్న యువతపై....కొరడా..జులిపించి... నూతన....భారతం....ఆవిష్కరించవలెను... మొబైలు...ఫోను...ఫేషను.... టీ..కేఫుల..అడ్డాలు...కట్టడిచేయవలెను... సంఘ..భాధ్యతలు....సంఘ..నియమాలు... జాతి..అమరుల....కుటుంబ..అవస్థలు...త్యాగ..ఫళాలు... పాఠ్యాంశాలై...బొదించవలెను.... వైధ్య..విజ్ఞానం..ప్రతి....వంటింట్లో....పలకరిస్తుండవలెను.... ప్రభుత్వ..సేవలు...అంధరికి....చేరువ..కావలెను.... ఉధ్యోగులు...నిష్కల్మశులై...బంట్రోతులుగా...పనిచేయవలెను.... అయిపోయింధని...ధులిపేసుకోవాకు.... నిర్మించేవరకు....నిద్రించకు.... పదవి..రాలేదని....ఆశించిన...ధనం...ఖ్యాతి....అందలేదని.. ముసుగుతన్ని....పడుకోవాకు.... నోర్లుతెరిచిన...జనం...ఇంకా...ఆశాతోనే... చేతులు..చాచి....అర్ధిస్తూనేవున్నారు...ఎండిన డొక్కలతో....మాసిన...బట్టలతో... మూలిగే....మనస్సులతో....................................................

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyQi5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి