చాంద్ || ఆమె గురించి || ఎందరో కళ్ళల్లో ఆమెను చూస్తూ ఉంటాను *** చిన్న పాప చీర చుట్టుకొని అచ్చం అమ్మలానే ఉన్నాను కదూ అని అడుగుతుంటే అతని కళ్ళల్లో ఆమె జ్ఞాపకం ఒకటి కరగడం గమనించాను *** ఆమెను కోల్పోయి చిరిగిన బాల్యాన్ని వాడి అతుకుల బట్టలతో ఎలా కప్పుతాడు అనురాగమో, ఆకలో వాటి విలువ వాడికి తెలిసినంతగా నాకు తెలియదు *** విసిరివేయబడిన విస్తరుల పక్కన ఎవడో వదిలించుకున్న అవ్వ కన్నుళ్లో అమ్మను బ్రతికించమని ఒక విజ్ఞాపన నన్ను నిలదీసింది *** ఊరులో ఆమెకు అన్నీ అమర్చి రోజూ అడుగుతాను అమ్మా నవ్వుతున్నావా అని ఆ.. అంటూ మొన్న పండక్కి నేను వచ్చినపుడు దాచుకున్న నవ్వు తీసి వినిపిస్తాది *** ఆమె గురించి అక్షరాలు కాదు వ్రాసే కన్నులు కావాలి నీకు నాకు చాంద్ || 11.05.2014 ||
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iEtDRO
Posted by Katta
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iEtDRO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి