పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

కొనకంచి లక్ష్మి నరసింహా రావు కవిత

Happy Mother's Day కొనకంచి లక్ష్మి నరసింహా రావు అమ్మ ఒంటరి రాత్రి కంటి నుంచి జారిపోయే కన్నీటి చుక్క.. ఎకాంతం అల్లుతున్న నైలాన్ సాలెగూడు.. కాలం కురులను ఆర్ద్రంగా దువ్వే చల్ల గాలి.. గది చెక్కిలి పై చిరునవ్వుల్ని వొంపుతున్న మొనాలిసా.. అన్నీ అంతర్వలయాల్లొ కందకాలు తవ్వుతున్నట్లు చేతులు చాస్తాయి. స్తబ్దంగ కదలని కాలంలో చికటి నవ్వినట్లు నాకేమీ తోచని అర్ద రాత్రి తెల్లని మంచు ముద్ద కప్పేసినట్లు భయం.. భయం.! ఎడర్ల కావల నదుల కావల నా చిన్ని పారదర్శకపు నోరు తెరిచి నీ ఊపిరిని ఉగ్గులొ కలిపి తాగించావు . దీప శిఖల్లా. అక్షరల్ని దిద్దించి ఏకంత సరస్సులో తేలిన ఎర్ర కలువను చేసావు. పిడికెడు మూగ గుందెమీద పికాసో చెయ్యి గీసినట్లు బాల్యం నిండా అన్నీ చిత్రలే! అలసిపోయిన హ్రుదయం పట్టు తప్పి ఆకాశంలోంచి జారి పడ్డట్టు దీప స్థంభం కింద పొంచి ఉన్న చీకటి ఆవలిస్తూ వెక్కిరిస్తుంది . స్మృతుల సర్పాలు క్రూరంగా కాళ్ళకు చుట్టుకొని ఊపిరి తీసుకోనియకుండా బుసకొట్టి భయపెడతాయి . ఎంత బలంగా మూసినా జ్ఞాపకాలు మాత్రం కిటికీలు తెరుచుకొనొచ్చి తేనెటీగల్లా ముసురుకుంటాయి పొలిమెరల్లొ నిలబడి సౌందర్యం నా కొసం ఆప్యాయంగా ఎంత ఎదురుచూసినా డియర్ మమ్మీ... దీపావళికి ముందు రోజున మొదటిసారి నేను బాంబు కాల్చినప్పుడు నీ కల్లలో మెరిసిన ఆనందార్ద్రత నిప్పు నలుసులా నాకింకా గుర్తుంది . ఊపిరాడని రాత్రి రంగేసుకున్న మృత్యువు నన్ను రకరకాలుగా వేధిస్తున్నప్పుడు కన్నీళ్ళతో నీవు ఆసుపత్రిలో చేసిన యుద్దం అకాల మరణం పొందని ఈ అదౄష్టవంతుడికింకా గుర్తుంది . ఇంటి ముందు వేపచెట్టుకింద గుండెల్ని వణికించే సంక్రాంతి చలిలో నువ్వు తలంటుతుంటే పడ్డ కుంకుడు రసం మంట ఎదార్ల కీవల నదుల కీవల నాకింకా గుర్తుంది. భవిష్యత్తును కట్టేసి నగరం రాక్షసిగా నన్ను అడుగడుక్కి భయపెట్టినా నీ, ఆశీర్వాద బలంతో రగుల్కొంటున్న జీవకణంలా నేను. చీకటి కాగితం మీద మెరిసే రేడియం అక్షరంలా నీ అమృత హస్తాలతో దేశం బుగ్గ మీద పెళ్ళిబొట్టు పెట్టినట్లు నీ వారసునిగా నేన్నేను.

by కొనకంచి లక్ష్మి నరసింహా రావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g9uwD6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి