పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

Indira Bhyri కవిత

. . . గజల్ ఆనందం కలిగినపుడు అమ్మ గుర్తుకొస్తూంది ఆవేదన తీర్చు అమ్మ ప్రేమ గురుతుకొస్తూంది అడగనిదే వరాలిచ్చె ఆమెచేతి చలువ చూస్తె ఫలాలిచ్చె కల్పతరువు కొమ్మ గురుతుకొస్తూంది ప్రశంసలే పన్నీరై నాపైనే కురిసినపుడు సుఖమంటే ఎరుగని తన శ్రమ గురుతుకొస్తూంది తెలిసితెలియకేనేమో మాటలనే తూలినపుడు కన్నీటితొ కడిగేసిన క్షమ గురుతుకొస్తూంది కోరుకున్న విజయాలే నాకు స్వంతమైనపుడు మాటరాని తనకన్నుల చెమ్మ గురురుతుకొస్తుంది మాను వంక చూసినపుడు మాటరాక నిలిచిపోతె అమ్మ త్యాగభరితమైన జన్మ గురుతుకొస్తూంది వింతలీను జగమునంత చుట్టినపుడు ఓ ' ఇందిర ' అమ్మ నాకు కొనిఇచ్చిన బొమ్మ గురుతుకొస్తూంది (అమ్మ తీవ్ర అనారోగ్యం పాలైన స్థితిలో ....అమ్మలందరికీ వందనాలు తెలపాలని ఈ కాస్త వీలు చేసుకున్నాను)

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaa6df

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి