అమ్మా !అమృతమూర్తి! నీవు కఠోరమైన పురుటి నొప్పులకోర్చి నాకు ప్రాణాలు ప్రసాదించావు నాపై నీలి నీడలు పడకుండా ఎలా కడుపులో దాచుకున్నావో ఎవరికీ కనిపించకుండా కన్నీళ్ళు తుడుచుకున్నావు నాకు తొలిసారి అనంతమైన ఆకాశాన్ని చూపించావు నాకోసం గోగుపూలు తెమ్మని జాబిల్లిని పిలించింది నీవు నిండు పున్నమి చంద్రునితో చెలిమి చేయించింది నీవు మల్లెల తెల్లదనాన్ని వెన్నెల చల్లదనాన్ని నాఒంటి పై పులిమింది నీవు జిలుగు తారలతో దోభూచులాడి సీతాకోకచిలకలతో పరవశాల పరుగులు నేర్పింది నీవు లోకాలు శాసించే ఏలికైన అలెగ్జాండర్ అశోకుడు ఆదిశంకరుడు ఎవరైనా తల్లి పాలు తాగిన పసివారే నీ జోల పాటలో ఎన్ని తత్వాలు ఎన్నెన్నో జీవిత సత్యాలు నిఖిల లోకాలు నవగ్రహాలు నక్షత్ర మండలాలు ఆదమరచి నిదురపోతాయి దేశం కానీ దేశంలో బ్రతుకు బరువైనపుడు గుర్తుకొచ్చేది అమ్మ కష్టాలు కన్నీళ్ళు క్రుంగ దీసినపుడు గుండెల్లో మెదిలేది అమ్మ అమ్మా ఎన్ని జన్మలైనా నీ రుణం తీర్చుకోలేను నీ చల్లని వొడి నాకు దేవుని గుడి.........
by ఉమిత్ కిరణ్ ముదిగొండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUcww
Posted by Katta
by ఉమిత్ కిరణ్ ముదిగొండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUcww
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి