/// జయరెడ్డి బోడ /// చెడగొట్టు వాన /// నేలపుత్రునిగా జన్మించి అన్నదాత వారసునిగా ఎదిగి పల్లె పడచుల అందాల మధ్య వెచ్చని అనుభూతిని చెంది కష్టమే తెలియని పక్షి దశలోనే ప్రకృతి పెట్టిన స్వచ్చమైన ఆహారానికి పాత్రుడవై .. మేధావిగా ఎదిగి పట్నంలోకి ఎగిరెల్లిన వాడా అక్కడి యాంత్రికత్వానికి వెగటు పుట్టి పల్లె పంచిన మధుర జ్ఞ్యాపకo లోనే బ్రతుకీడుస్తున్నావ అలాగే నీ జ్ఞ్యాపకాల ఊపిరిలో నైనా చల్లగా సేదదీరు స్నేహితుడా .. ఇప్పుడిక్కదంతా మొన్న ప్రసరించిన ఎండ వేడికి పలిగిన నెర్రెల్లో, ఎండిన చేల్లల్లో మాడిన మొఖాల్లోని లోతైన మనుషులే అగుపిస్తారు ఇక నిన్న కురిసిన అతివృష్టి అకాల వర్షానికి,, క్రింద మీద పడి కూడేసుకున్న వడ్ల గింజలకు రెక్కలొచ్చి వాన నీటి లో కొట్టుకు పోతుంటే బిగపట్టుకున్న కడుపులోని కడివెడు దుఃఖంతో, అయినా మొక్కవోని దైర్యంతో వాటికి చేతులడ్డు పెడుతూ కన్నీరు కూడా కనిపించనియ్యని "ఆ చెడగొట్టు వాన లో" బీటు బజారులలో పిల్ల పాపలతో అన్నయ్యలు వదినమ్మలు ముసలి తల్లులు తండ్రులు హృదయ విధారకంగా అయ్యా ,ఇక నీ ఉహాల లోకం అలాగే సాగనీ, తప్పి దారి పొరపాటున ఇటు వైపు రాబోకు మిత్రుడా మోడువారడం.. పుష్పించడం అలవాటైన ఈ పల్లె మొరటు మనుషుల మధ్యన ... సున్నితత్వంతో...తట్టుకొని నువ్వు నిలువలేవు జాగ్రత్త!!! (11-05-2014)
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g8kz8T
Posted by Katta
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g8kz8T
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి