అమ్మా! మనసారా నన్ను క్షమించు! ***********************************రావెల పురుషోత్తమరావు అమ్మా! మనసారా నన్ను క్షమించు! ఐశ్వ ర్యానికి నిర్వచనం తెలీని కుటుంబంలోనుంచి వచ్చినా అందరినీ ఆనంద వార్ధిలో ముంచె త్తి మురిపించావు. ఐదు పదులైనా నిండకముందే ఐహిక సుఖాలనన్నింటినీ వదలుకుని ఆవలి తీరాలకు వెడలిపోయావు. చీకటంటే వెలుగు దారుల వెంట వెన్నంటి నడిపించే అశ్యమైన శక్తి అని పదే పదే చెపుతూ వచ్చావు. ఊహతెలియకముందే మమ్మల్నందరినీ దుఃఖ సాగర0లో ముంచి వెళ్ళిపోయావు. ఎంత ఉన్నతమైన సంస్కారమోనీది!!! ఊరు ఊరంతా కన్నీటి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చినప్పుడే మాకు తెలిసిపోయిందమ్మా! అందరూ కాదంటున్నా నాకిష్టమైన అమ్మాయిని కోడలిగా ఇంటికి తెచ్చి నీకు ప్రతిరూపమన్నట్లుగా నిలిపాను. ఆరేళ్ళు నిండకుండానే నా ముద్దులపట్టి పరలోకానికి ప్రష్తానం సాగిస్తే గుండెను చిక్కబట్టుకుని కాలం గడిపాను. నోములూ వ్రతాలంటూ నీకోడలు నిన్ను మరిపించిందటమ్మా అందరూ అంటుంటే తెలిసిందమ్మా -- ఆవిడా నీకొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలకు సామాధానాలను తెలిసికోవాలని బయలుదేరి వచ్చిందమ్మా! మనుమలూ మనవరాండ్రనూ చూసి మురుసుకుంటూనే వాళ్ళందరినీ ఇక్కడనే వదిలేసి ఒక్కతే నన్ను ఒంటరితనానికి ఒదిలేసి ఒచ్చేసిందమ్మా! నీవు బహుశా శతాధిక వృద్ధురాలివై ఉంటావు! ఈపాటికి అయినా వాళ్ళ బాగోగులను నువ్వే చూసుకోవాలి తప్పదమ్మా! ఆజన్మాంతం నీకు ఋణ పడి ఉండడం మాటేమో గాని తనువు చాలించిన తర్వాతకూడా నీపై బరువును మోపిన దురదృష్టవంతుడినమ్మా నన్ను మనసారా క్షమించు. ఇప్పుడంతా చీకటే జీవితమైపోయిందని ఎలాచెప్పాలో తెలియకుండాపోతున్నది!!! ===================================11-5-14
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyPec
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liyPec
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి