పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మే 2014, ఆదివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అమ్మ దైవత్వానికి ప్రతిరూపం ఆకాశంలోని అనంత వైశాల్యం సముద్రంలోని లోతైన హృదయం భూమి యొక్క దివ్యమైన రూపం ప్రేమ యొక్క మధురమైన భావం ఒక దానితో ఒకటి విలీనమై మానవాళి కోసం ఏర్పాటైన నిత్యత్వం గల ఒక అపురూప వ్యక్తిత్వం ఆమే అమ్మ- అమ్మ అంటే ఒక అద్బుతం అమ్మ - ప్రపంచాన్ని పరిరక్షించే మాతృత్వం ప్రపంచంలోని తన బిడ్డల ఆత్మలకి పోషణ ఇచ్చే సత్యమైన సంపూర్ణ ప్రేమతత్వం ఈ రోజు మనందరికీ మాతృదినం మనందరి జీవితాలలో సుదినం ప్రపంచమే ఆమెలో ఒక సూక్ష్మ భాగం ఇదే అమ్మ కోసం నా గుండె అర్పించే ప్రేమరాగం! [మే 11, 2014 న Mother’s Day సందర్భంగా తల్లులందరికీ శ్రద్ధాంజలితో] © జాస్తి రామకృష్ణ చౌదరి 11May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sgw1PB

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి