అమ్మా...... పులకరించిన మేని.... పాశాన్ని పలకరిస్తే.. మతృత్వానికి అర్ధంచెబుతూ అనురాగపుకేక మరో జీవితాన్ని హత్తుకుంటుంది. నీడకుకూడా గొడుగుపట్టే అమ్మతనం ఆర్తితోకప్పే చీరకొంగులా నిరంతరం నిన్ను కాపాడుకుంటుంది. ఇకనుండి నీ ప్రతీఅడుగూ... అమ్మ కళ్ళల్లో పుట్టే మెరుపులతో రక్షించబడుతుంది. ఆ తన్మయం కోసమేనేమో... తన గుండెల్ని చీల్చుకువచ్చినా నిన్ను తన ప్రాణంలా మార్చుకుంటుంది. కనులముందు కణేల్ మంటున్న నిప్పుకణికని కౌగిలించుకుంటావా? నచ్చినరంగే కదా అని రక్తాన్ని కుళ్లబొడుచుకోగలవా? ఇవన్నీ అమ్మే చేయగలుగుతుంది అందుకే దేవుడికైనా తాను అమ్మే అవుతుంది. శ్రీఅరుణం 9885779207 విశాఖపట్నం-530001
by Sriarunam Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RBRVlj
Posted by Katta
by Sriarunam Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RBRVlj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి