//అలుపెరుగని బాటసారి// ------------------------------ // శ్రీనివాసు గద్దపాటి// -------------------- అగ్నిసాక్షిగా కలిసి ఏడడుగులతో మొదలై అండగా నడవాల్సిన అడుగులు కాస్తా అర్థాంతరంగా ఆగిపోతే....! ఒంటరి బాటసారివై ఎన్ని కన్నీటి మజిలీలు దాటావో...?! తుఫానుదెబ్బకు గూడుచెదిరిన గువ్వ పిల్లల్లాంటి మమ్ముల్ని ఆప్యాయతనే రెక్కలమాటున పొదువుకొని ఎన్ని శోకసముద్రాలీదావో.....? సూర్యునితో మొదలై సుక్కలదాకా నువ్వొక్కదానివే కదమ్మా ఎన్ని పాత్రలు పోషించావో...? కంటినిండా ధైన్యం గుండె నిండా ధైర్యం ఎన్నో ముండ్ల బాటల్ని... మాకై పూలబాటలుగా మారుస్తూ... అలుపెరుగని బాటసారిలా సాగుతున్న అమ్మా.......నీకుహాట్సాఫ్.....!!! (మాతృదినోత్సవం సందర్భంగా ...అమ్మకోసం) 11.05.2014
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RA1f9p
Posted by Katta
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RA1f9p
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి