ఏపాట నే పాడను కొలతలు లేని నల్లని కాలం కాళ్లనుంచే మొదలు కొలతల కందని తెల్లని నీడలు బహుశ దిగంతాల దాకా నల్లని కాలమూ తెల్లని నీడలూ జలకాలాడి సృష్టించిన ఆకుపచ్చని స్వప్నం నిజానికి స్వప్నం కాదు.... ఓ జీవితం ...కాదు ఓ ప్రపంచం!! పచ్చల జలకాంతిలో ఎగిరే నీరు తప్ప కన్నీరు లేని జీవితంలో కాలాన్ని ధిక్కరిస్తూ గడ్డిపోచ లోలకం మీద ఊయల ఊగే ప్రపంచం కప్ప, గడ్డి, మిడత, తూనీగా .. ఎవరైనా ఆకుపచ్చని ఆర్ద్రనిశ్శబ్దాన్ని శృతిచేసి గడ్డిపోచ లోలకం లయలో ఆలపిస్తే? అది నల్లని మేఘాల పాట విద్యుల్లతల చుట్టూ మొరిసే కాంతి పాట అది నానావర్ణాలతో కులికే భూమి పాట అది సమస్తవర్ణాలనూ కొత్తరంగుల్లోకి మార్చే కాలాగ్ని పాట ఇంతాచేసి అది ఆరుబయల్లో పిల్లల వానపాట ____________________________వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGGbXC
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGGbXC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి