Aduri Inna Reddy || అందరూ అంతే ...స్వార్ద పరులు..|| ----------------------------------------------------------- కొంచెం అటు ఇటుగా అందరూ అంతే ...స్వార్ద పరులు తన ఆనంద కోసం ఎదుటి మనిషి మనసుతో ఆడుకోవడం అన్నీ చేసి ఏం తెలియనట్టు అమాయకంగా నటించడం ఒక్కొసారి ఏందుకో నన్ను నేను నమ్మని నిజాలను బుజాన వేసుకొని ఎక్కడని తిరగను నన్ను ఎవ్వరూ నమ్మరు నేను వాళ్ళకు ఆడూకొనే ఆట వస్తువుని కదూ ...? అవే కళ్ళు అవే కళ్ళు నన్ను నన్ను గా నిలవనీయని అందమైన కళ్ళు అవే కళ్ళు మిలమిలా మెరుస్తాయి అవే కళ్ళు ఎడతెగని దుఖాన్ని కురిపిస్తాయి అవే కళ్ళు క్రోధంతో ఎర్రబడతాయి నన్ను అవమానించి తగలపెడతాయి ఒకరిలోకి ఒకరు ప్రయాణించీ నేణు మారమే ఒంటరిగా మిగిలిపోయా ఇంకొకరిలోకి ఒకరు ప్రవేశించ లేక కొన్ని రహస్య ప్రదేశాల్లో కొన్ని ఆశలతో ఆత్రంగా తడుముకున్న ప్రతిసారి నీవు పక్కన లేచూ నీకోసం వెతికితే ఎక్కడో దూరంగా నీవు ఇంకొకరి వడిలో నీవు కరిగిపోతూ తన్మయత్నంలో ఉన్నావు అందుకే ఆ దృశ్యాలను చూడలేక ..నా కళ్ళలో మన జ్ఞాపకాలను గుచ్చి రక్తం ఓడుతున్న నన్ను నేను గాయ పరుచుకంటూ సాగుతున్నానిలా నలిగిన మనసుకదా నాది ఎలా నన్ను ఓదార్చుకోను కాస్త చెప్పవూ దు:ఖ దు:ఖంగా..నిశ్శబ్ధంగా మౌనంగా నేను ఇల తగల బడుతూనే ఉన్నా నిన్ను మరొకరి కౌగిలిలో చూసి తలవంచుకొని నడుస్తూనే ఉన్నా గమ్యం ఎటో తెలియక
by Aduri Inna Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1IEQh
Posted by Katta
by Aduri Inna Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1IEQh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి