పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

నీల్లగోలెం నువ్వు పిలుస్తవని నేను పిలువకుండ ఎట్లొస్తవని నువ్వు చెరో దిక్కు ముకం సూడకుండ మాట్లాడితే అద్రగానం వానకు కండ్ల ఒర్రెలు మునిగిపోతయి గుండెవాగులు పొర్లిపోతయి కుదిరితెనె కలుస్తం తియ్ ఏముంది ఎదురుసూసుకునుడేగద ఎంతకాలమైనా మనకొరకు వసంతం ఆగివుంటదిలే రెప్పపాటే మన దూరాలన్ని ఎర్రమట్టిఅలుకు చల్లి, సున్నం పట్టీలుపెట్టిన మట్టిగోడలకు ఈసారి మనబొమ్మలేసుకుందాం ఈతచాప చల్లదనాలు చుట్టిపెట్టు దీపంకోసం ఓ ఇదికాకు చుక్కలు ముట్టించుకుందం మామిడిపూవాసనలతో గాలివిసనకర్ర మాఘమాసంవెన్నెల్ని విసురుతుందిలే నేను బయలుదేరంగనె నీకెరుకజేస్త తొవ్వలు మువ్వలు మోగించుకుంటొస్తయి తనబ్బిలో దాచినవన్ని ఒకసారి సూడు మరిచిపోయినయి తీసుకొస్త మన యాదికి ఎక్కడాపాల్నొ ముచ్చట తెలుస్తలేదు గడికి కలుక్కుమని మనసు పళ్ళున కండ్లపొంట వాన చెడగొట్టుడు వానకు కాలమేంది బుదగరిస్తానికి దుక్కం మన సుట్టమా వొద్దన్నా కన్రెప్పలతడికనూక్కుంటొస్తనే వుంటది పోనీ పోనీ మనం కలుస్తెసాలు నవ్వులకొంగుతోని ముకం తుడుసుకుందం 04.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1swyn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి