తిలక్/ఇంకా ఎన్నిసార్లు ---------------------------- కొన్ని కర్పూర కాంతులు కరిగిపోయాక ఆశల ఆనవాళ్ళు చెదిరిపోయాక నీలోని కొన్ని క్షణాలను నీకు నువ్వుగా అర్పణ చేస్తావు చూడు గతించిన జ్ఞాపకాలు మనసు నిర్వేధంలో మరుగునపడిపోయాక యతించినావు నీవు నాలో ఎన్నాళ్ళుగానో మరచిపోలేని శ్వేత మయురంలా నన్ను అల్లుకున్నపుడు నీ యద రెక్కలపై తల వాల్చిన సమయాలను ఎలా పోగెయ్యను ఇంకా ఎన్ని మార్లు నా ఆత్మ దహనమవ్వాలో నీ ఊహల ఖజానాలో. తిలక్ బొమ్మరాజు 04.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1suGI
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1suGI
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి