కాశి రాజు ||చిక్కుడు గింజల సెగలో|| ఇల్లుమొత్తం నిండుకున్నా లేనితనం ఎప్ప్పుడూ లేదు మాటో, పిలుపో ,సర్దుబాటో చేసిపోతావ్ అమ్మేమో అప్పైనా తెచ్చివండేస్తది బదులివ్వడం తెలిసిన బతుకుల్లో లేదన్నబాధ తెలీదని అమ్మ కొసరి వడ్డిస్తున్నపుడే తెలుస్తాది. ఆకలిగా ఆవురావురంటూ తిని, కాస్త నిండాక కాళ్ళుసాపుకు తిని అమ్మా నువ్వూ కూడా తిను. అన్నపుడు నాకు నిండిందని నిర్దారించుకున్న మీరిద్దరూ మాకు ఆకలైనపుడు మెతుకుల్లాగా మారిపోయారు బడికెళ్లలేదేరా అని అడుగుతుంటే బియ్యం లేవన్న సమాదానం అమ్మ సెప్పిందో, నా ఆకలే సెప్పిందో తెలీలేదు ఆ పూట మనం కాలుచుకుతిన్న పచ్చి చిక్కుడుకాయల ముదురు గింజలన్నీ కమ్మదనాన్ని కాదు గాని , అమ్మదనాన్నే తెలిపాయి. ఆ పొయ్యి సెగకి నువ్వు కాస్త నా పక్కకు జరిగాక, నాన్నా ! ఆకలితో కాదుమనం, అమ్మతో నిద్దరోయాం
by కాశి రాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fDQs1K
Posted by Katta
by కాశి రాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fDQs1K
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి