మరువం ఉష | ఒద్దిక --------------------- రోజూవారీ ఘటన: ప్రవహిస్తూ కాలం, ప్రసరిస్తూ పొద్దుటెండ బాటపట్టి నేను-కిటికీలోకి పట్టిపట్టి చూస్తూ- సాదరంగా నవ్వే పాపాయి కోసం చిన్ని కళ్ళలో ఒకింత విస్మయం, రవ్వంత కుతూహలం ఆ ప్రపంచంలోకి ఆహ్వానం ఇద్దరికీ తీరిక చిక్కితే నిన్నటి నుంచి నేటిలోకి పలకమాగిన పలుకరింపులు చిట్టిపొట్టి మాటల రుచి చెప్పరానంత! అంతలోనే బిక్కమొగం అందుకునే ఆరున్నొక్కటి బిత్తరి నా చూపులిక బాట వెంట బిరబిరలు, పరుగందుకోలేని పాదాలతో అమ్మవొడి చేరగానే మొలకెత్తే గారాబం, రసవత్తరం కిటికీ అద్దానికి అతుక్కున్న చిన్నారి హస్తకమలం... తుమ్మెదలుగా మారిన నా పాదాలిక అక్కడక్కడే తిరుగాడతాయి. (మార్చి, 2014 "కౌముది" లో ప్రచురించబడింది) 04/04/14
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5fayy
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5fayy
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి