@@ అపార్ట్ మెంట్లు @@ _ కొత్త అనిల్ కుమార్ . # 4/3/2014 ఎప్పటికి ఏవో జ్ఞాపకాల కదలికలతో మనసంతా సందడిగా ఉంటున్దేన్దుకో సందడి అంటే సంబురం కాదు గాని ఏవో గుర్తుకొస్తుంటాయి అనవసరంగా అన్ని యాది చేసుకునే నిరంధి జీవితం కాదు .కాని ఏదో రంది మదిని కదిలించేలా చేస్తుంది ఈ దినసరి మనవ యంత్రం నడిచి నడిచి చల్లబడాలంటే తిరిగి గూడు చేరి తలుపు లేసుకోవలసిందే తప్ప .,మందలించే మనిషుండదు అవును మరి., ప్రపంచీకరణ విసర్జించిన మనుషుల పుట్టాలనే అపార్ట్ మెంట్లలో ... నిన్న మొన్నటి వరకున్న వంద వాకిల్లని ఫ్లాట్లుగా మారిపోయాయి వాకిళ్ళ పై ఉన్న పిండి ముగ్గులన్ని పెయింట్ గీతలయినాయి ఆత్మీయ మనసులన్ని అపార్ట్ మెంట్ జాలిలో వడ పోయబడ్డాయి గల్లిలన్ని మాయమై విలాసం మిగిల్చిన విల్లలినాయి ఎవరి మనసులు వారికే ఎవరి చూపులు వారికే హద్దులు నిర్దేశింపబడిన అత్మీయప్రవర్తన లోపల ప్రేమలున్నా మించకూడదు చొరవలు కరువైన కృత్రిమ జీవితాలు ఒకప్పుడు మనసుల్లోకి మనుషులు అలవోకగా చొచ్చుకేల్లెవారు ఒకరింటి గుమగుమలు దారిని చీల్చుకుని ఇంకొకరింట్లోకి వెళ్లి నిండిపోయేవి ఇప్పుడంత పెద్ద దారులు లేకున్నా ఈ స్నేహ పరిమళాలు దర్వాజాలు దాతలేవు దాటిన ... మనిషి మనిషికి కనిపించినంత సేపే చక్కగా అతికించుకున్న పలకరింపులు అందంగా అలకరించుకున్న చిరునవ్వులు ఆ గూళ్ళలో ప్రేమలు లేవని నేననను ప్రేమను పాటిస్తున్నారనేదే నా బాధ మనసుకు వేరే బాధ లేక కాదు ఈ అనుభవాల యేరు గుండెను తడి చేస్తూ వెళ్ళడమే బాధ . కుదుట పడ్డ మనసు ఇలాంటి వెతలతో మల్లి పదనౌతుంది లక్షణంగా గడిపేస్తున్న జీవితంలో నాకేం బాధ లేదు కాని లక్ష్యాన్ని నిర్దేశించుకుని బ్రతికే యంత్రాలు ప్రేమకు కొంత 'spase ' ను నిర్దేశించుకుని జీవించడమే కొంత బాధ నాకు మనిషి బ్రతికే స్థలమే తగ్గింధనుకున్న మనసు బ్రతికే స్థలమూ తగ్గింది . _ కొత్త అనిల్ కుమార్ .
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hEZz7k
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hEZz7k
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి