పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Srivalli Radhika T కవిత

ఎందాకా..!//టి.శ్రీవల్లీ రాధిక నేనొక మందహాసాన్ని ఏమరచి ప్రకటిస్తే.. తాము పారేసుకున్న నవ్వుల్ని వెతికేందుకు పరుగుతీస్తారు.. ఓ విజయాన్ని పరాకుగా ప్రస్తావిస్తే.. తాము సాధించిన పతకాలన్నిటినీ ప్రదర్శనకు పెడతారు ఒక సంతోషం సీతాకోకచిలుకలా నాచేతిపై వాలితే వేవేల పుష్ప రాశుల్ని తమ వాకిళ్ళలో ఎరగా వెదజల్లుతారు ఒక గౌరవం నక్షత్రంలా నా తలపై మెరిస్తే వందల మణిగుచ్చాలని తమ యింటి పైకప్పులకి వేలాడదీస్తారు నా చుట్టూ ఉన్న వారు.. అన్నివేళలా ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఆరాటపడతారు నవ్వులోనూ నడకలోనూ నన్నధిగమించాలని ప్రయత్నిస్తారు హటాత్తుగా ఒకరోజు.. ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా.. నిరామయంగా.. ఆనందంగా.. అతి సహజంగా నిష్క్రమించే అవకాశం మొదట నాకే వస్తే.. పాపం వీళ్ళంతా ఏం చేస్తారు! అలవోకగా నేను దాటిపోతుంటే నాకన్నా ముందు నడవ లేక నేనెటు వెళ్తున్నానో అర్ధం కాక బహుశా ఇక్కడే ఆగిపోతారు.. ఎవరి శరీరాలలో వాళ్ళు అశక్తులై నిలిచిపోతారు ***

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nqjyvx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి