కత్తిమండ ప్రతాప్ || విష దారులు || ================================ ఎప్పుడో నువ్వు నడిచి వెళ్ళిన నీ పాదాల తడి ఇంకా ఆరలేదు పాదముద్రల్లో దాగిన కుల పిలుపుల తడి ఇంకా చిమ్ముతూనే ఉంది రహదారుల్లో ఎండమావుల్లా నీ కుల పాదాల ముద్రలు గాయాలై అక్కడక్కడా కనిపిస్తూ అప్పుడప్పుడు వెక్కిరిస్తు వెళ్ళిపోతున్నాయి చారలు పోయినా ఛాయలు కనపడుతున్నాయి పయనించే దారుల్ల్లో విష భీజాలు నాటావు కాబోలు కుల వృక్షాలు అక్కడక్కడా ముళ్ళు విడుస్తున్నాయి ముళ్ళను దాటుకుంటూ పయనిస్తుంటే చిన్న చిన్న ముళ్ళు అప్పుడపుడు గాయపరుస్తునే ఉన్నాయి నీ పాదాల తడిలో నా పాదాలు గాయలై రక్తం కారుస్తున్న్నాయి చిమ్మ చీకటిని చీల్చుకుంటూ అడుగులేస్తున్న నా పాదాలు ఇప్పుడు విష సర్పాలను కూడా దాటేస్తున్నాయి విషం తడిపే నీ పాదాలను లెక్క చెయ్యకుండా పడగలెత్తిన నీ సంస్కృతిని నా అడుగులతో కప్పేస్తా ! ========= మార్చి 04/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q0ZZJg
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q0ZZJg
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి